Top Ad unit 728 × 90

కరోనా ఎఫెక్ట్: పరీక్షలు వ్రాయించకుండానే వారిని పాస్ చేస్తారట…!

కరోనా ఎఫెక్ట్: పరీక్షలు వ్రాయించకుండానే వారిని పాస్ చేస్తారట…!

  

ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకూ పరీక్షలు రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ శుక్రవారంనాడు ప్రకటించారు. ఈ తరగతుల విద్యార్థులను పరీక్షలు రాయనవసరం లేకుండా తదుపరి క్లాస్‌లకు ప్రమోట్ చేస్తామని చెప్పారు.

'9, 11 తరగతులకు ఏప్రిల్ 15 తర్వాత పరీక్షలు నిర్వహిస్తాం. 10వ తరగతికి మినహా టీచర్లంతా ఇంటి నుంచి పని చేస్తారు. 10వ తరగతికి ఇంకా రెండు పరీక్షలే నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతాయి. ఎస్ఎస్‌సీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది' అని మంత్రి వర్ష గైక్వాడ్ మీడియాకు తెలిపారు.

 

కాగా, ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంలో (పుణె-పింప్రి-చింద్వాడ్, నాగపూర్) నిత్యావసర సేవలు, ప్రజా రవాణా మినహా అన్నింటినీ మూసివేస్తున్నట్టు ఉద్ధవ్ థాకరే సర్కార్ ప్రకటించింది. మార్చి 31 వరకూ అన్ని దుకాణాలు (నిత్యావసరాలు మినహా), కార్యాలయాలు మూసే ఉంటాయని థాకరే తెలిపారు. ఇవి హాలిడేలు కావని, జనసమూహాలను నియంత్రించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, రాష్ట్రంలో బ్యాంకులు తెరిచే ఉంటాయని ఆయన చెప్పారు. ఇంతవరకూ రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు.

 

కరోనా ఎఫెక్ట్: పరీక్షలు వ్రాయించకుండానే వారిని పాస్ చేస్తారట…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *