Top Ad unit 728 × 90

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో గందరగోళం...!

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో గందరగోళం...!

 

పరీక్షకు హాజరైన విద్యార్థులకు భిన్నమైన ప్రశ్నాపత్రాన్ని ఇవ్వటంతో అయోమయానికి గురైన విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ న్యాయం చేయాలని కూకట్పల్లి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా వివేకానందనగర్డివిజన్పరిధిలోని ఎంఎన్ఆర్కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం డిగ్రీ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షలో భాగంగా 2016-17 విద్యాసంవత్సరానికి చెందిన బ్యాక్లాగ్విద్యార్థులకు తాజా 2019-20కి సంబంధించి సెమిస్టర్విధానపు ప్రశ్నాపత్రాన్ని పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు అందజేశారు. ప్రశ్నాపత్రాలు అందుకున్న విద్యార్థులు కొద్ది సేపటికి తేరుకుని ఇదేమిటని ఇన్విజిలేటర్ను ప్రశ్నించగా తమకు పై నుంచి జారీ అయిన ప్రశ్నాపత్రాన్నే ఇచ్చామని బదులిచ్చారు. 2016 విద్యాసంవత్సరానికి సంబంధించి పరీక్ష కేంద్రంలో తరహాలో 150 మంది విద్యార్థులు డిగ్రీ తొలి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన అనంతరం తమ విధానానికి భిన్నమైన పరీక్షా పత్రాన్నివ్వటం వల్ల తాము ఫెయిలయ్యే అవకాశం ఉన్నదని బాధిత విద్యార్థులు వాపోయారు. తమకు మళ్లీ పరీక్షను నిర్వహించాలని, లేని పక్షంలో తమకు న్యాయం చేయాలని కూకట్పల్లి పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందచేశారు.

 

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో గందరగోళం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *