Top Ad unit 728 × 90

తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే అపశృతి…!

తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే అపశృతి…!

 

కోవిడ్ నిబంధనల సడలింపు తరువాత విద్యా సంస్థలు ప్రారంభమైన తొలిరోజునే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) లో అపశృతి చోటు చేసుకుంది. రిమ్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 23 మంది విద్యార్థులు భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విద్యా సంస్థలు ప్రారంభం కాగా, రిమ్స్ లోనూ వైద్య విద్యార్థులకు ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని యాజమాన్యం తరగతులను ప్రారంభించింది. అయితే మధ్యాహ్న సమయంలో రిమ్స్ మెస్ లో భోజనం చేసిన పలువురు వైద్య విద్యార్థులు వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ బలిరాం హుటాహుటిన వసతి గృహాలకు చేరుకొని అస్వస్థులైన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు. వారికి అక్కడి వైద్యులతో అత్యవసర వైద్య చికిత్సలు అందించారు.

ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని, అస్వస్థతకు గల కారణాలను తెలుసుకుంటున్నామని రిమ్స్ డైరెక్టర్ డా. బలిరాం తెలిపారు. కాగా వైద్య విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిమ్స్ ను సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి రేపటిలోగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, రిమ్స్ డైరెక్టర్, ఆర్డిఓ, ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో ఓ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ఎలాంటి తరగతి గదుల శిక్షణ లేకుండా కేవలం ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయిన ప్రైవేట్ స్కూళ్లు ఇప్పుడు స్కూళ్లు ఓపెన్ చేసిన తర్వాత కొత్త రకం ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదేంటంటే, 'కరోనా ఫీజు'. ఔను. మీరు చదివింది కరెక్టే. కరోనా ఫీజు అంటే, స్కూలుకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, స్ప్రే చేసేందుకు అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ స్కూళ్లు లేవు కాబట్టి, తమ వద్ద పనిచేసే ఆయాలు, పనివాళ్లను కూడా స్కూళ్లు తొలగించాయి. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు తెరవడంతో స్కూళ్లు క్లీనింగ్ చేయడానికి, ఇతరత్రా పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నాయి యాజమాన్యాలు.

కరోనా ఫీజును ఒక్కో స్కూలు ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఆ ఫీజులు మరింత ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. కరోనా కారణంగా తాము ఎంతో నష్టపోయామని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజుల విషయంలో కొన్ని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా, విద్యార్థుల నుంచే ఆ ఫీజును కూడా వసూలు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించాయి.

తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే అపశృతి…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *