Top Ad unit 728 × 90

ఇంటర్‌ ఫలితాల విధివిధానాలు ఏమిటంటే...!

ఇంటర్‌ ఫలితాల విధివిధానాలు ఏమిటంటే...!

 

ఇంటర్‌ ఫలితాల విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫస్టియర్‌లో వచ్చిన మార్కులే సెకండియర్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రాక్టికల్స్‌లో100 శాతం మార్కులు ఇవ్వనుంది. బ్యాక్‌లాగ్స్‌ ఉంటే 35శాతం మార్కులతో పాస్‌ చేయనుంది. ప్రైవేట్‌గా పరీక్ష రాసే విద్యార్థులకు 35శాతం పాస్‌ మార్కులు ఇవ్వనున్నారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.

 

కరోనా కారణంగా తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. ఫస్టియర్‌లో కూడా వీరిని గ్రేడ్‌ల విధానంతో పాస్ చేశారు. సెండియర్ ఎలా ఫలితాలు ఇస్తారోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది కూడా అదే విధానంలో పాస్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న టెన్షన్, అనుమానాలకు తెరపడింది.

ఇంటర్‌ ఫలితాల విధివిధానాలు ఏమిటంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *