Top Ad unit 728 × 90

జాబ్‌మేళా: 12 కంపెనీల్లో 902 ఉద్యోగాలు...!

జాబ్‌మేళా: 12 కంపెనీల్లో 902 ఉద్యోగాలు...!

 

నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శనివారం మినీ జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌బ్యూరో అండ్‌ మోడల్‌ కెరియర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ అధికారి ఎన్‌.అనంతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్పైడర్‌ ఎలక్ట్రికల్స్‌, వివసే సోనిక్స్‌, ఆల్‌ ట్రస్ట్‌ టెక్నాలజీస్‌, ప్రొబిటీ సొల్యూషన్స్‌, ఐడీబీఐ ఫెడరల్‌ లిమిటెడ్‌, అపోలో ఫార్మసీ, జీకేబీఆర్‌ ఎక్సలెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెగారియాస్‌ సొల్యూషన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, విబా బీపీవో, శ్రీపతిల్యాబ్స్‌, స్కైప్రో తదితర 12 సంస్థల్లో 902 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నామన్నారు. ఎంపికైన వారికి రూ.10 - 20 వేల వరకు వేతనంగా చెల్లించబడుతుందని, అభ్యర్థుల వయస్సు 19-30 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఆసక్తి, అర్హతలు గల వారు శనివారం సింక్సోసర్వ్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ అల్వాల్‌ నందు ఉదయం 10:30 గంటల నుంచి జరిగే మేళాకు హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి.రఘుపతి 82476 56356, 91000 64574 సంప్రదించాలన్నారు.

జాబ్‌మేళా: 12 కంపెనీల్లో 902 ఉద్యోగాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *