Top Ad unit 728 × 90

జాబ్స్: ఐఐపీఈలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు

జాబ్స్: ఐఐపీఈలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు

 

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

 

ఫ్యాకల్టీ పోస్టులు:

1. పెట్రోలియం ఇంజినీరింగ్‌ (ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

2. కెమికల్‌ ఇంజినీరింగ్‌ (ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

3. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

4. మ్యాథమెటిక్స్‌ (అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

5. కెమిస్ట్రీ (అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

6. ఇంగ్లిష్‌ (అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

7. కౌన్సెలర్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

 

అర్హతలు:

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ ముగిసిన తర్వాత మూడేండ్ల అనుభవం ఉండాలి. 45 ఏండ్ల వయస్సులోపు వారై ఉండాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు ఆరేండ్ల ఇండస్ట్రియల్‌ లేదా రిసెర్చ్‌ లేదా టీచింగ్‌ అనుభవం ఉండాలి. 45 ఏండ్ల వయస్సులోపు వారై ఉండాలి.

ప్రొఫెసర్‌: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు పదేండ్ల టీచింగ్‌ లేదా రిసెర్చ్‌ అనుభవం ఉండాలి. 55 ఏండ్ల లోపువారై ఉండాలి.

 

నాన్‌టీచింగ్‌ పోస్టులు:

మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. అందులో లైబ్రేరియన్‌-1, డిప్యూటీ లైబ్రేరియన్‌-1 (ఎస్సీ), ఆఫీసర్‌ ఐటీ- 3, సీనియర్‌ సూపరింటెండెంట్‌-1, సెక్రెటరీ టూ రిజిస్ట్రార్‌-1, గెస్ట్‌హౌస్‌ మేనేజర్‌- 1, టెక్నీషియన్‌- 5 (ఎస్సీ-1, ఓబీసీ-1, జనరల్‌-3), టెక్నికల్‌ అసిస్టెంట్‌- 13 (జనరల్‌-5, ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-4, ఈడబ్ల్యూఎస్‌-2), ల్యాబ్‌ అసిస్టెంట్‌-4 (జనరల్‌-4, ఎస్సీ-1, ఓబీసీ-1)

 

అర్హతలు: సంబంధిత రంగంలో డగ్రీతోపాటు, అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం: ఇంటర్వూ (టీచింగ్‌ పోస్టులకు), రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్‌, కంప్యూర్‌ టెస్ట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ (నాన్‌టీచింగ్‌ పోస్టులకు)

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేదీ: జూలై 24

వెబ్‌సైట్‌: www.iipe.ac.in

జాబ్స్: ఐఐపీఈలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *