Top Ad unit 728 × 90

హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు. ఖాళీల వివరాలు ఇవే…!

హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు. ఖాళీల వివరాలు ఇవే…!

 

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు రోహ్‌తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

జూనియర్ టెక్నీషియన్ (ఫీల్డ్ ట్రయల్స్)- 1
ఆపరేటర్ ఫ్లూడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ- 1
ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1
ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1
ఆపరేటర్ ఆటోక్లేవ్- 1జూనియర్ ఆర్టిసన్ వెల్డర్- 1
జూనియర్ స్టాఫ్ నర్స్- 3

దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
వేతనం- ఏడాదికి రూ.3,90,000 నుంచి రూ.4,50,000

ముందుగా https://midhani-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Careers సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
అందులో E-recruitment పైన క్లిక్ చేయాలి.
APPLY MIDHANI POSTS పైన క్లిక్ చేయాలి.
అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

హైదరాబాద్‌లోని మిధానీలో ఉద్యోగాలు. ఖాళీల వివరాలు ఇవే…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *