Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

త్వరలో 61 ఎంవీఐ, 14 ఏవో పోస్టులు భర్తీ…!

త్వరలో 61 ఎంవీఐ, 14 ఏవో పోస్టులు భర్తీ…!

 

త్వరలో ఏఎంవీఐ, సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల కోసం కసరత్తు జరుగుతున్నది. ఖాళీగా ఉన్న మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులతోపాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రవాణాశాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడడంతో చాలా మంది ఎంవీఐలను జిల్లా రవాణాశాఖ అధికారులుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎంవీఐల కొరత తీవ్రంగా రవాణాశాఖను వేధిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఖాళీగా 61 ఎంవీఐ పోస్టులున్నాయి. 14 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులున్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల సీట్లలో ఇప్పటికే సీనియర్‌ అసిస్టెంట్లు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్‌ పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎంవీఐలకు ఎంవీఐలుగా, సీనియర్‌ అసిస్టెంట్లకు అడ్మిన్‌ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా రూపొందించారు. అయితే కొన్ని కేసులు సీనియర్లకు అడ్డంకిగా నిలుస్తున్నట్లు తెలిసింది. పదోన్నతుది జాబితాకు అర్హులైనప్పటికీ దీనిని సాకుగా చూపుతున్నట్లు తెలిసింది. అయితే సెకండ్‌ వెహికల్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో దాదాపు సీనియర్‌ అసిస్టెంట్లకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

సీనియర్ల జాబితాలో అర్హులైన వారికి పదోన్నతి రావాల్సి ఉన్నప్పటికీ రవాణాశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపంతో కొంత జాప్యం జరుగుతున్నది. ఒక అధికారి పదోన్నతుల కోసం కృషిచేస్తున్నప్పటికీ మరో అధికారి దీనికి అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక లావాదేవీలు జరిగే గ్రేటర్‌లో ఎంవీఐల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ భారాన్ని ఏఎంవీఐలు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులు మోయవలిసి వస్తున్నది. కొత్త వాహనాల తనిఖీ వంటి విషయాల్లో ఒక్కోసారి ఆర్‌టీవో కార్యాలయం మీద ఆధారపడి జీవించే దళారులే రిపోర్టు ఇస్తున్నారనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పదోన్నతులు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు జాప్యం జరిగేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే పదోన్నతులు, బదిలీలు ఇదే నెలలో జరుగవచ్చని రవాణాశాఖకు చెందిన జేటీసీ తెలిపారు.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలో 61 ఎంవీఐ, 14 ఏవో పోస్టులు భర్తీ…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *