Top Ad unit 728 × 90

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేందుకు ఎన్‌ఈపీ యోచన...!

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేందుకు ఎన్ఈపీ యోచన...!

 

ప్రాథమిక విద్యను మాతృభాషలో నిర్వహించేందుకు నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 పరిశీలిస్తుందని మనూ ఇన్చార్జి వీసీ ప్రొ॥ ఎస్ఎం రహమతుల్లా అన్నారు. మనూ క్యాంపస్లో 'దీక్షారంభ్‌ - స్టూడెంట్స్ఇండక్షన్ప్రోగ్రామ్‌ (ఎస్ఐపీ)-2020'ను కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థుల కోసం సోమవారం ప్రారంభించారు. ఆరు రోజుల పాటు కొనసాగే కార్యక్రమాన్ని విద్యార్థుల సంక్షేమ కార్యాలయ డీన్ఈనెల 17 తేదీ వరకు కొనసాగించనున్నారు. సందర్భంగా ఇన్చార్జి వీసీ ప్రొ. ఎస్ఎం రహమతుల్లా మాట్లాడుతూ ఇప్పటికే మౌలానా ఆజాద్జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం ఎలిమెంటరీ స్కూల్నుంచి రీసెర్చ్స్థాయి విద్య వరకు మాతృభాషలో బోధిస్తుంది. నూతన విద్యా విధానం నైపుణ్యాలను సముపార్జించడంపై దృష్టి సారించి, మనూ ఐటీఐ, పాలిటెక్నిక్‌, బీటెక్కోర్సులను ప్రస్తుతం అందిస్తోందన్నారు. కొత్త విద్యా విధానంలో భాగంగా విదేశాలలో విద్యా సంస్థల శాఖలను సైతం ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. మౌలానా విశ్వ విద్యాలయం భారత ప్రభుత్వ సహకారంతో విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. మౌలానా ఆజాద్సాధించిన విలువలపై ఆయన దృష్టి సారించి, సోదరభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారని అన్నారు. క్రమశిక్షణకు కట్టుబడి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని విద్యార్థులను ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ప్రొ.సిద్ధిఖీ మహ్మద్మహమూద్‌, డైరెక్టరేట్అడ్మిషన్స్‌ - డైరెక్టర్ప్రొ.ఎం.వనజ, ప్రొ.అబ్దుల్సమి సిద్ధిఖీ, ప్రొ.సయ్యద్అలిమ్అశ్రఫ్‌, డా.ముషారత్జహన్‌, తదితరులు పాల్గొన్నారు.

 

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేందుకు ఎన్‌ఈపీ యోచన...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *