Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

నీట్​లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు...!

నీట్లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు...!

 

జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో ఇద్దరు విద్యార్థులు సంచలన ఫలితాలను నమోదు చేశారు. ఇద్దరికీ సమానంగా.. 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. వైద్య ప్రవేశ పరీక్షలో ఇలా నూటికి నూరు శాతం మార్కులు రావడం అరుదైన విషయం. ఒడిశా విద్యార్థి సోయబ్అఫ్తాబ్‌, ఢిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్ఇలా చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో ఇద్దరికీ వరుసగా ప్రథమ, ద్వితీయ ర్యాంకులు లభించాయి. నీట్ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులూ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థిని తుమ్మల స్నికిత 3 ర్యాంకు సాధించి, తెలంగాణ ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తొలి 20 ర్యాంకుల్లో మన విద్యార్థులు మూడింటిని సొంతం చేసుకోగా, తొలి 50 ర్యాంకుల్లో 7 స్థానాలను కైవసం చేసుకొని సత్తా చాటారు.ఇంకా అనంత పరాక్రమ(11 ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషారెడ్డి(14 ర్యాంకు), శ్రీరామ్సాయి శాంతవర్థన్‌(27 ర్యాంకు), ఆర్షశ్అగర్వాల్‌(30 ర్యాంకు), మల్లేడి రుషిత్‌(33 ర్యాంకు), ఆవుల శుభాంగ్‌(38 ర్యాంకు) ముందు వరుసలో నిలిచారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్‌(అఖిల భారత ర్యాంకుల్లో 58 ర్యాంకు) 17 స్థానాన్ని పొందారు. ఈనెల ఆఖరి వారంలో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. కొవిడ్నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నీట్‌-2020ను గత నెల 13 నిర్వహించారు. కొవిడ్బాధితుల కోసం ఈనెల 14 మరోసారి నిర్వహించారు. వీరందరి ఫలితాలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు 'జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(నేషనల్టెస్టింగ్ఏజెన్సీ-ఎన్టీఏ)' ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా రాత్రి 8 గంటల వరకూ ఫలితాలు వెల్లడవ్వలేదు.

నీట్​లో సత్తా చాటిన రాష్ట్ర విద్యార్థులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *