Top Ad unit 728 × 90

పదో తరగతి పరీక్షలు వాయిదా…!

పదో తరగతి పరీక్షలు వాయిదా…!

 

కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే రేపు జరగాల్సిన పరీక్షను మాత్రం యదావిధిగా నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీషెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలపై పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో..అత్యవసరంగా కోర్టు విచారణ చేటట్టింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది.

పదో తరగతి పరీక్షలు వాయిదా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *