Top Ad unit 728 × 90

ప్రేక్షకలోకానికి పూర్తి స్థాయిలో 59 ఏళ్ల క్రితం, అంటూ…!

ప్రేక్షకలోకానికి పూర్తి స్థాయిలో 59 ఏళ్ల క్రితం, అంటూ…!

 

ఫ్యామిలీ హీరోగా, విలన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా ఆయన ఎంచుకున్న ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తూ పరిపూర్ణ నటుడిగా పేరుపొందారు జగపతిబాబు. పెద్ద నిర్మాత కొడుకే అయినప్పటికీ, ఆయన జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా పనికిరాడనే సంశయం నుంచి వరుస హిట్స్‌ ఇచ్చే హీరోగా మారారు. హీరో నుంచి విలన్‌గా మారే క్రమంలోనూ, అంతకు ముందు కొన్ని సంవత్సరాలు ఆయన అనుభవించిన సంఘర్షణ గురించి పలు సందర్భాలలో క్లుప్తంగా చెప్పారు జగపతిబాబు. కానీ తన జీవితాన్ని, అందులోని ఒడిదుడుకులను, సంతోషాలను, సరదాలను ప్రేక్షకలోకానికి పూర్తి స్థాయిలో 59 ఏళ్ల క్రితం అంటూ మొదలెట్టబోతున్నాడీ జగ్గూభాయ్‌. నిజంగా ఇది జగపతిబాబు నుంచి ఎవరూ ఊహించనిదే.

 

తన సినిమా టైటిల్‌ 'సముద్రం' పేరుతో, ఇట్స్‌ మై లైఫ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో, తన లైఫ్ స్టోరీని, తన మాటల్లోనే చెప్పేందుకు రెడీ అవుతున్నారు జగపతి బాబు. ఏదైనా సరే ముఖం మీద కొట్టినట్లుగా, ఏదీ దాచుకోకుండా చెప్పేసే జగపతిబాబు నుంచి ఆయన అభిమానులకు ఎన్నో విషయాలు తెలియబోతున్నాయనేది తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ ద్వారా తెలుస్తుంది. ఈ ట్రైలర్‌ ఒక్కటి చాలు జగ్గూభాయ్‌, లైఫ్‌ స్టయిల్‌ ఎలా నడిచిందో చెప్పడానికి అనేలా ట్రైలర్‌ని కట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రేక్షకలోకానికి పూర్తి స్థాయిలో 59 ఏళ్ల క్రితం, అంటూ…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *