Top Ad unit 728 × 90

పవన్, మహేష్ లకు సుమంత్ గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడని…!

పవన్, మహేష్ లకు సుమంత్ గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడని…!

 

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రేమకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున మేనల్లుడు అక్కినేని సుమంత్. తొలి సినిమా ప్రేమకథకు రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ లో ఆ సినిమాపై మంచి నమ్మకు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ తరువాత మాత్రం ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో సుమంత్ చేసిన ఒక చిన్న తప్పిదం వల్లనే ఆల్మోస్ట్ స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించవలసిన ఆయన, ఆ తరువాత నుండి పెద్దగా సక్సెస్ లు లేక కెరీర్ పరంగా చాలా వెనుకపడిపోయారు.

 

అయితే ఆ సినిమా మరేదో కాదు, తరుణ్ హీరోగా రిచా హీరోయిన్ గా తెరకెక్కిన నువ్వే కావాలి. 2000వ సంవత్సరం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించగా విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్, రామోజీరావు నిర్మాతలుగా రూపొందిన ఆ సినిమా అప్పట్లో రూ.1.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపుగా రూ.24 కోట్లవరకు కలెక్షన్ ని రాబట్టి అత్యద్భుత విజయాన్ని అందుకుంది.

 

అక్కడక్కడా ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య కేంద్రాల్లో ఆ సినిమా కొన్ని సెంటర్స్ లో సిల్వర్ జుబ్లిని జరుపుకోవడం విశేషం. అయితే సరిగ్గా ఆ సినిమా విషయమై నిర్మాత స్రవంతి రవికిశోర్ తన వద్దకు వచ్చి ఒక మంచి కథ ఉంది, అది మీకు పక్కాగా యాప్ట్ అవుతుంది, మీరు ఓకే అంటే రచయిత వచ్చి కథ చెప్తారు అని అన్నారట. అయితే అప్పటికే తాను యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలకు కాల్ షీట్స్ ఇచ్చి ఉండడంతో తాను చెయలేనని చెప్పారట సుమంత్.

 

అయితే ఆ సినిమా రిలీజ్ అయి ఎంతో గొప్ప సక్సెస్ సాధించిన తరువాత ఒకింత ఆలోచనలో పడ్డారట సుమంత్. కాకపోతే తాతయ్య వంటి పెద్దవారితో సినిమా చేస్తున్న సమయంలో వారిని కాదని నువ్వే కావాలికి డేట్స్ ఇవ్వడం వీలు లేకనే అలా చేసానని ఇటీవల ఈ ఘటనను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో సుమంత్ గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సినిమా కనుక సుమంత్ చేసి ఉంటె అతడి కెరీర్ ఆ తరువాత నుండి మరోలా ఉండేదని, ఇక అదే సమయంలో మెల్లగా హీరోలుగా పుంజుకుంటున్న పవన్, మహేష్ లకు రాబోయే రోజుల్లో సుమంత్ తప్పకుండా గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు...!

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పవన్, మహేష్ లకు సుమంత్ గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడని…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *