ఓ గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం: సమంత అక్కినేని
ఓ గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం: సమంత అక్కినేని
కరోనా లాక్డౌన్ తో సినీ సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమానులు తెరపై మిస్సవుతున్న వినోదాన్ని సోషల్ మీడియా వేదికగా పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వినోదాత్మకమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూనే.. తమ ఫ్యాన్స్‌కు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్(ఫోటో) ఫోటోస్ హవా నడుస్తోంది. దీంతో కొందరు సెలబ్రెటీలు తమకు సంబంధించిన పాత ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
Ramayana Jaya Mantram | రామాయణ జయ మంత్రం | PSLV TV NEWS
ఇక సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే సమంత అక్కినేని తాజాగా పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. సమంత, ఆమె భర్త నాగ చైతన్య, తమ పెంపుడు కుక్క హ్యాష్‌తో కలిసి కారులో కూర్చున్న ఓ పాత ఫోటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా `దాదాపు ఓ గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం` అంటూ క్యాప్షన్ కూడా జతచేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకు కేవలం గంటల వ్యవధిలోనే వన్ మిలియన్ లైక్స్ రాబట్టడం విశేషం. ఇక ప్రస్తుతం నాగచైతన్య `లవ్‌స్టోరీ` చిత్రంతో బిజీగా ఉన్నారు.
