Top Ad unit 728 × 90

అనుపమ పరమేశ్వరన్ సరసాలు...!

అనుపమ పరమేశ్వరన్ సరసాలు...!

 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ గా దిల్ రాజు సక్సెస్ మేనియా కొనసాగుతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు నిర్మాతగా లాభాలు పొందిన దిల్ రాజు, అల వైకుంఠపురములో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుండి కూడా మంచి లాభాలు పొందాడు. అయితే జాను విషయంలో నిరాశ మిగిలినా శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో అది కూడా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యిందని అంటున్నారు.
 

నిర్మాతగా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ తో ఉండే దిల్ రాజు ఎప్పుడు టార్గెట్ మిస్ అవకుండా చేస్తాడు. ఇక ఇప్పుడు అతని అండతో తన మేనళ్ళుడు ఆశిష్ రెడ్డిని హీరోగా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను శ్రీ హర్ష డైరెక్ట్ చేస్తున్నాడు. హుషారు సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు దిల్ రాజుని మెప్పించే కథ చెప్పడంతో అతనితో ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

 

మళయాళ ముద్దుగుమ్మ అనుపమ తెలుగులో సినిమాలైతే చేస్తుంది కాని తగిన క్రేజ్ తెచ్చుకోవట్లేదు. యువ హీరోల సరసన నటిస్తున్న ఈ అమ్మడు కొత్త వారితో జతకడుతుంది. రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న అనుపమ ఆశిష్ తో జత కడుతుంది. ఈ సినిమాలో అనుపమ తన గ్లామర్ సైడ్ కూడా చూపిస్తుందని తెలుస్తుంది. నిర్మాత మేనళ్ళుడు కాబట్టి హీరోయిన్ ను ఫుల్లుగా వాడేస్తారని తెలుస్తుంది. మరి ఆశిష్ రెడ్డితో అనుపమ రొమాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. క్యూట్ అనుపమ హాట్ హాట్ గా కనిపిస్తే మాత్రం తన ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకోవడం ఖాయం. మరి అనుపమ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి.

 

అనుపమ పరమేశ్వరన్ సరసాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *