Top Ad unit 728 × 90

ఈ సారి పక్కా తెలంగాణ స్టైల్‌లో బాలకృష్ణ ట్రీట్‌

ఈ సారి పక్కా తెలంగాణ స్టైల్‌లో బాలకృష్ణ ట్రీట్‌

 

త్వరలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్‌బీకే 108 (NBK 108) చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ.

 

ఎన్‌బీకే 108 గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న వారందరికీ వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.

 

వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఇక త్వరలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఎన్‌బీకే 108 (NBK 108) చేసేందుకు రెడీ అవుతున్నాడు. కామిక్‌ టచ్‌ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసే అనిల్ రావిపూడి నెక్ట్స్ చేయ బోయే సినిమా ఏ జోనర్‌లో ఉండబో తుందోనని ఇప్పటికే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

 

ఎన్‌బీకే 108 గురించి ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న వారందరికీ వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ‘బాలకృష్ణ మామూలు ప్రజలతోపాటు అభిమానులకు కూడా ఆ సినిమా ఎంత బాగా నచ్చాలని జాగ్రత్త తీసుకుంటారు. అందుకే ప్రతీ సినిమాకు ఎన్‌బీకే టచ్ యాడ్ చేస్తారు. అదే టచ్‌తో వీరసింహారెడ్డి వచ్చింది. ఎన్‌బీకే టచ్‌తో మళ్లీ 108 కూడా రాబోతుంది. కాకపోతే ఈ సారి అన్న రాయలసీమలో కాదు, తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో ఖుర్బానీ పెడ్తడు. గెట్‌ రెడీ’ అంటూ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు అనిల్ రావిపూడి.

 

ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఈ సారి పక్కా తెలంగాణ స్టైల్‌లో బాలకృష్ణ ట్రీట్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *