Top Ad unit 728 × 90

రజినీకాంత్‌ ఇంట్లో బాంబు బెదిరింపు కాల్ చేసింది ఆ కుర్రోడా…!

రజినీకాంత్‌ ఇంట్లో బాంబు బెదిరింపు కాల్ చేసింది ఆ కుర్రోడా…!

 

రెండు రోజుల క్రితం తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్టు ఓ ఫోన్‌కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నై పోయిస్‌ గార్డెన్‌ ప్రాంతంలోని రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టారని , 108 నంబర్‌కు ఓ అజ్ఞాత ఫోన్‌కాల్‌ వచ్చింది. కంట్రోల్‌ రూం ద్వారా అప్రమత్తమైన పోలీసులు, బాంబు నిర్వీర్య దళంతో కలిసి రజినీకాంత్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ఆవరణతోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించకపోవడంతో నకిలీ కాల్‌గా తేల్చారు. ఫోన్‌కాల్‌ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయగా, కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. పోలీసు విచారణలో అతని మెడికల్ స్టేట్‌మెంట్స్ పరిశీలించి ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేదని భావించి వదిలిపెట్టారు. మొత్తానికి 13 ఏళ్ళ ఆకతాయి చేసిన పనికి అందరు ఉలిక్కిపడ్డారు.

రజినీకాంత్‌ ఇంట్లో బాంబు బెదిరింపు కాల్ చేసింది ఆ కుర్రోడా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *