Top Ad unit 728 × 90

ఛలో… నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా: నటి సోనాక్షి సిన్హా

ఛలో నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా: నటి సోనాక్షి సిన్హా

 

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ పరిశ్రమలో అలజడి నెలకొంది. సుశాంత్ ఆత్మహత్య కు ఇండస్ట్రీలో నెపోటిజమే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బైకాట్ బాలీవుడ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన నటీనటులపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి సోనాక్షి సిన్హాపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసారు. దాంతో ఆమె ట్విట్టర్ లో భావోద్వేగంతో ఓ పోస్ట్ చేసారు. ట్విట్టర్ కి గుడ్ బాయ్ అంటూ ఆమె ట్వీట్ చేసారు. "నీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలంటే వేయాల్సిన తొలి అడుగు నెగటివిటీకి దూరంగా ఉండటమే. ముఖ్యంగా ఈ సమయంలో ట్విట్టర్‌కి దూరంగా ఉండాలి. ఛలో నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా. బై గైస్... ఇక ప్రశాంతంగా ఉండండి " అంటూ ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి ఇంకా వెలుగులోకి రాలేదు. కానీ నెటిజన్లు మాత్రం అతడి ఆత్మహత్య కు కారణం వారసత్వమే అనటంతో మరి కొందరు సెలబ్రెటీలు కూడా ట్విట్టర్ ను వీడుతారని చర్చ నడుస్తోంది.

ఛలో… నేను నా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేస్తున్నా: నటి సోనాక్షి సిన్హా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *