Top Ad unit 728 × 90

రీమేక్ సినిమాలపై మనసు పారేసుకుంటున్న మెగా హీరోలు...!

రీమేక్ సినిమాలపై మనసు పారేసుకుంటున్న మెగా హీరోలు...!

 

ఒక భాషలో విజయవంతమైన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడమేనేది ఎప్పటి నుంచో వస్తోంది. అయితే మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది రీమేక్ సినిమాలలో నటిస్తుండటంతో వాటి హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా హీరోలు మధ్య బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. 'ఖైదీ నెం. 150' రీమేక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సినిమా 'వేదలమ్' ని రీమేక్ చేయబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీ ఎంట్రీ మూవీగా రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. హిందీ హిట్ 'పింక్' సినిమాని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. క్రమంలో మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తారు. అలానే రామ్ చరణ్ మలయాళ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ పై రూపొందనున్న చిత్రంలో ఎవరు నటిస్తారో చూడాలి. అలానే 'ధృవ' కి సీక్వెల్ గా మరో రీమేక్ ఉండబోతోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా హీరోల నుంచి అర డజను రీమేక్ లు వస్తుండగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రీమేక్ సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

కాగా అల్లు అర్జున్ బాలీవుడ్ హిట్ సినిమా ''సోనూ కె టిటూ కీ స్వీటీ'' ని రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడట. సినిమా అక్కడ వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. నేపథ్యంలో ఇప్పటి వరకు రీమేక్ సినిమాల వైపు వెళ్లని బన్నీ హిందీ మూవీ రైట్స్ కూడా తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పటికే బన్నీ కమిటైన రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఉండే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మరి వీటి తర్వాత బాలీవుడ్ రీమేక్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 

రీమేక్ సినిమాలపై మనసు పారేసుకుంటున్న మెగా హీరోలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *