మహేష్ బాబుపై మనసు పారేసుకున్న స్టార్ బ్యూటీ...!
మహేష్ బాబుపై మనసు పారేసుకున్న స్టార్ బ్యూటీ... ఎవరంటే?
రాశి ఖన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపు తున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయం లోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించు కున్నారు.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన రాశి ఖన్నా ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపు తున్నారు.
తెలుగులో తను నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. జోరు, విలన్, ప్రతి రోజు పండుగే, వెంకీ మామ వంటి చిత్రాలు విజయవంతం కావడంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు "పక్కా కమర్షియల్" సినిమాలో నటించింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించాడు.
ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా రాశీ ఖన్నా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఈమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. ఈమెకు టాలీవుడ్ హీరోల్లో ఏ హీరోతో మీరు సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అని యాంకర్ ప్రశ్నించింది. ఈమె ప్రశ్నకు సమాధానంగా, రాశీ ఖన్నా మాట్లాడుతూ... మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనీ ఉందని తన మనసులోని మాట చెప్పుకొచ్చింది. దీంతో ఈమె మహేష్ సినిమా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది. మహేష్ బాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది హీరోయిన్స్ చేసారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో ఈమె కూడా చేరిపోయింది. మరి రాశీ ఖన్నాకు మహేష్ సినిమాలో అవకాశం వస్తుందో రాదో చూడాలి.
