Top Ad unit 728 × 90

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్...!

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్...!

 

స్టార్కమెడియన్గా కెరీర్ పీక్స్ లో ఉండగానే అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నారు సునీల్. సినిమా విజయం సాధించడంతో తర్వాత పూలరంగడు, మర్యాద రామన్న వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించాడు సునీల్. అయితే సినిమాలతో విజయాలు అందుకున్నా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆయనకు ఛాన్సులు ఇచ్చేవారే కరువయ్యారు. నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన 'కలర్ ఫోటో'లో విలనిజం చూపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కమెడియన్గా ఇప్పుడు ఆయనకు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త హల్చల్ చేస్తోంది. కన్నడలో విజయం సాధించిన 'బెల్బాటమ్' సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారట. కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. రీమేక్ మూవీలో సునీల్ను హీరోగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితుల్లో సునీల్ మళ్లీ హీరోగా చేసే సాహనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *