Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

తనని ఖతం చేస్తారని ముందే చెప్పాడు సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్...!

తనని ఖతం చేస్తారని ముందే చెప్పాడు సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్...!

 

 

సుశాంత్ మరణం గురించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటు మీడియా అటు పోలీసులు సుశాంత్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ ఇలా పలువురుని విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ ప్రముఖ నేషనల్ టీవీ ఛానల్ జరిపిన చర్చలో సుశాంత్‌కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది.

 

ఇండస్ట్రీలోని కొందరు సుశాంత్ ని వేధిస్తున్నారని తన సోదరికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసేవాడు. వారినికి ఒక్కసారైన మేం గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. డిప్రెషన్ ఉండేది కాదు కాని ఏదో ఆందోళనతో మాట్లాడుతున్నట్టు కనిపించేవాడు. జూన్ 9న తన మేనేజర్ దిశా సలియాన్ మరణించిన తర్వాత సుశాంత్ చాలా కుంగిపోయాడు. ఓ రకమైన భయాందోళనకి గురయ్యాడు. దిశానే కాదు నన్ను కూడా వదలరు. నన్ను కూడా ఖతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని దిశా చనిపోయిన తర్వాత సుశాంత్ తన సోదరి మితూతో భయపడుతూ మాట్లాడాడు అని స్మిత పేర్కొంది. ఆయన డిప్రెషన్‌తో బాధపడలేదు. బై పోలార్ డిజార్డర్ కూడా లేదు.

 

చనిపోయే మూడు రోజుల ముందు సినిమాలు మానేసి వ్యవసాయం చేయాలని భావిస్తున్నట్టు నాకు చెప్పాడు. కాని అంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించడం బాధగా ఉంది. నవంబర్‌లో సుశాంత్‌ని కలిసినప్పుడు ఏదో బాధలొ ఉన్నట్టు కనిపించాడు. తాను ఎవరివలన వేధించబడుతున్నాడనే విషయం గురించి ఎక్కడా నోరు విప్పలేదు అంటూ స్మితా పారిఖ్ పేర్కొన్నారు. అయితే సుశాంత్ మరణించడానికి ముందు ఆయన ఇంట్లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో పెద్ద గొడవ జరిగిందని ఓ వర్గం చెబుతుండగా, అలాంటిదేమి లేదని సుశాంత్ వంట మనిషి చెబుతుండడం పలు అనుమానాలకి తావిస్తుంది.

తనని ఖతం చేస్తారని ముందే చెప్పాడు సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *