ఒకే టికెట్ పై రెండు సినిమాలు
ఒకే టికెట్ పై రెండు సినిమాలు
పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒకే రోజు రెండు సినిమాలని చూపించడానికి షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ లు రెడీ అయ్యారు. స్టాల్ వార్ట్స్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠాన్' మూవీ జనవరి 25న రిలీజ్ అవుతుందనే విషయం తెలుసు కానీ సల్మాన్ ఖాన్ సినిమాలేవీ రిలీజ్ కి లేవే అని ఆలోచిస్తున్నారా. షారుఖ్ 'పఠాన్' మూవీలోనే సల్మాన్ ఖాన్ ఒక ఎక్స్టెండేడ్ క్యామియో రోల్ ప్లే చేస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగమైన ఇండియన్ స్పై 'టైగర్'గా సల్మాన్ ఖాన్, పఠాన్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లోని టైగర్ క్యారెక్టర్ ని మంచి ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ ఖాన్ క్యామియో ప్లే చెయ్యడం పఠాన్ సినిమాకి కలిసొచ్చే విషయం.
షారుఖ్, సల్మాన్ ఖాన్ లు కలిసి ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ. ఇది మాత్రమే కాదు జనవరి 25న ఆడియన్స్ ని మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు సల్మాన్ ఖాన్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కాటమరాయుడు' సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న 'కిసీ కా భాయ్, కిసీ కి జాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డేలు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ టీజర్ ని పఠాన్ మూవీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ఇంటర్వెల్ లో ప్లే చేస్తున్నారు. అంటే జనవరి 25న థియేటర్ కి వెళ్తే పఠాన్ సినిమాలో షారుఖ్, సల్మాన్ ల యాక్షన్ తో పాటు 'కిసీ కా భాయ్, కిసీ కి జాన్' టీజర్ ని కూడా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు అన్నమాట. ఇప్పటివరకూ పఠాన్ సినిమా బుకింగ్స్ ఒక రేంజులో ఉంటే, సల్మాన్ ఖాన్ టీజర్ అనౌన్స్మెంట్ తో పఠాన్ బుకింగ్స్ మరింత పెరగనున్నాయి. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' టీజర్ ని స్క్రీన్ పైన చూడడానికి టికెట్స్ బుక్ చేసుకునే వాళ్లు ఎక్కువగా ఉండడం షారుఖ్ 'పఠాన్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని మరింత పెంచానున్నాయి.
#KisiKaBhaiKisiKiJaan Teaser ab dekho bade parde par on 25th Jan...@VenkyMama @hegdepooja @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii #VinaliBhatnagar @farhad_samji @ShamiraahN pic.twitter.com/pbVSce3xYH
— Salman Khan (@BeingSalmanKhan) January 23, 2023
