Top Ad unit 728 × 90

బిగ్ బాస్: చాలా క్లోజ్‌గా ఓ వ్యక్తి మీద మీదకు వస్తుంటే అని రహస్యం చెప్పిన అభిజీత్

ఇంటి సభ్యులకు బిగ్ బాస్ గురువారం రోజు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరైతే వారి సీక్రెట్స్ చెబుతారో వారికి ఫ్యామిలీ రాసి పంపిన ఉత్తరాలు అందుతాయని చెప్పడంతో ఒక్కొక్కరు కన్ఫెషన్ రూంలోకి వచ్చి సీక్రెట్స్ బయట పెట్టారు. హారిక రెండేళ్ళ క్రితం జరిగిన ముచ్చట చెప్పుకొచ్చింది. తన తల్లికి తెలియకుండా అబ్బాయితో రిలేషన్లో ఉన్న విషయాన్ని బిగ్ బాస్ వేదికగా బట్ట బయలు చేసింది. ఎక్కువ కేరింగ్ చూపించే సరికి అట్రాక్ట్ అయ్యాను. సారీ అమ్మ, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. నీ దగ్గర దాచింది ఇదొక్కటే అంటూ చెప్పుకొచ్చింది. హారికకు కూడా అఖిల్ లేఖ పంపాడు. హారిక అన్నయ్య లెటర్ రాయగా, అది చదువుతూ ఎమోషనల్ అయింది.

 

అనంతరం కన్ఫెషన్ రూంలోకి వచ్చిన అవినాష్ తన పడ్డ కష్టాలు వివరించాడు. కిరాణ షాపులో పని చేస్తూ సినిమా ఛాన్స్ కోసం ట్రై చేసా. ఆఫీస్ బాయ్ గా కూడా వర్క్ చేశాను. సారి ఆడిషన్కి మణికొండ వెళితే రూ. 80 వేలు ఇస్తే ఛాన్స్ ఇస్తామని అన్నారు. అప్పు చేసి మరీ డబ్బు తెచ్చి ఇస్తే వారు నన్ను మోసం చేశారు. విషయం మా తల్లిదండ్రులకు ఇప్పటికి తెలియదు అని అవినాష్ చెప్పాడు. విషయం తనకు తెలుసని చెప్పిన అఖిల్ లేఖని కట్ చేసి పంపాడు.

 

ఇక లాస్య వంతు ఇచ్చింది. ఇప్పటికే పలు షాకింగ్ విషయాలు చెప్పిన లాస్య సారి తన భర్తకు సంబంధించి కొత్త విషయం చెప్పింది. నా భర్త నా కన్నా ఏడాది చిన్న. షోకి వచ్చాక మా అమ్మకి షాకుల మీద షాకులు ఇస్తున్నా. నా కన్నా చిన్న వాడు అయిన మను గొప్పది అంటూ కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది లాస్య. ఈమె రీజన్ నచ్చడంతో లాస్యకు లేఖ పంపాడు అఖిల్. ఇక అభిజీత్ యూఎస్ లో జరిగిన సంఘటన వివరించాడు. రెస్టారెంట్కు వెళ్లినప్పుడు వ్యక్తి చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు. నా నెంబర్ అడిగాడు. సరే అని నెంబర్ కూడా ఇచ్చా. అయితే మీద మీదకు వస్తుంటే ఏం చేస్తున్నావ్ అని అడిగితే ఇది గే బార్ అని చెప్పాడు. అప్పుడు బయటకు వెళ్ళి బోర్డ్ చూసి షాకయ్యాను అని అన్నాడు అభి. ఇంత పెద్ద సీక్రట్ని రివీల్ చేసినందుకు అభికు కూడా లేఖ అందించాడు అఖిల్.

బిగ్ బాస్: చాలా క్లోజ్‌గా ఓ వ్యక్తి మీద మీదకు వస్తుంటే అని రహస్యం చెప్పిన అభిజీత్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *