Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్వతారోహణ శిక్షకురాలు అన్వితా రెడ్డి, ఐపీఎస్‌ అధికారి తరుణ్‌జోషితో కలిసి టాంజానియాలోని కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ హనుమాన్ పేట బైపాస్ వద్ద దారుణం జరిగింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని బావ గఫార్‌ను బావమరిది సలీం హత్య చేశాడు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో జనవరి 21 సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు. 145 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తొలిసారి 50,000 పాయింట్లను దాటింది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

డోక్లాం దగ్గరలోనే చైనా ఆయుధ బంకర్లు...!

సరిహద్దులో చైనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి మరోవైపు సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్మించినట్లు తేలింది. 2017లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లాం నుంచి ఈ ప్రాంతం కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

నిజానికి గతేడాది డిసెంబర్‌లో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేనట్లు అప్పటి శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబర్ 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్తయినట్లు కనిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంకర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. డోక్లాం ప్రాంతంలో మరోసారి వివాదం తలెత్తితే చైనా బలగాలు సమర్థంగా పోరాడేలా ఈ బంకర్లను ఏర్పాటు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన ఈ ప్రాంతంలో తమ బలగాలను పెంచే ఆలోచనలో చైనా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే జరిగితే మరోసారి డోక్లాంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.

మరోవైపు,ఇటీవల భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల మేర చొచ్చుకొని వెళ్లిన చైనా ఏకంగా గ్రామాన్నే నిర్మించినట్లు తేలగా, ఆ తర్వాత 9 కిలోమీటర్ల మేర రోడ్డునూ నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్మించినట్లు తేలింది.

డోక్లాం దగ్గరలోనే చైనా ఆయుధ బంకర్లు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *