హైదరాబాద్ మేయర్ ఎంపికకు అంతా రడీ...!
గ్రేటర్ ఎన్నికలు అయిపోయాయి. రిజల్ట్ వచ్చేసింది. కానీ, మేయర్ ఎంపిక మాత్రం కాలేదు. పెండింగ్ లో ఉంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగిసి పద మూడు రోజులు అవుతోంది. అయినా సరే ఇక్కడ ఇంకా కొత్త మేయర్ ఎంపిక మాత్రం కాలేదు. దీనిపై ఎన్నికల అధికారులు ఫోకస్ చేశారు. హైదరాబాద్ మేయర్ ఎన్నికకి.. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నికకి టైం ఫిక్స్ చేశారు.
ఇంకెంత కాలమో లేదు. షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 11న 11 గంటలకు ప్రిసైడింగ్ ఆఫీసర్ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఓ గంటా గంటన్నరలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అయిపోతే, వెంటనే 12 గంటల 30 నిమిషాలకు కార్పొరేటర్లు మేయర్ ను డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ పర్యవేక్షన కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని నియమించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఒక వేళ ఏదైనా కారణం చేత ఫిబ్రవరి 11న గానీ మేయర్ ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజున ఎన్నిక కంప్లీట్ చేయాలని కూడా నోటిఫికేషన్ లో క్లారిటీగా ఇండికేషన్ ఉంది. కాబట్టి వీలైతే ఫిబ్రవరి 11న లేదంటే ఫిబ్రవరి 12న హైదరాబాద్ కి కొత్త మేయర్ ఎవరో క్లారిటీ రానుంది.
మరి ఏ పార్టీకి ఎంత బలం ఉంది అంటే మాత్రం అంతా గందరగోళంగా ఉంది. పోయినసారి అంటే టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. బీజేపీ బండి స్పీడుకి టీఆర్ఎస్ సీట్లు తగ్గడంతో హంగొచ్చింది. యాక్చువల్ గా మేయర్ కావాలంటే 104 మంది ఓట్లు పడాలి. కానీ, ఏ పార్టీకీ అంత బలం లేదు. టీఆర్ఎస్ కి 56 సీట్లు, బీజేపీకి 48 సీట్లు, ఎంఐఎం కు 44 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు మరో రెండు సీట్లు వచ్చాయి. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కూడా ఇక్కడ కౌంట్ అవుతాయి. కాబట్టి అవి లెక్కేసుకున్నా టీఆర్ఎస్ కే ఎక్కువ ఉన్నాయి. టీఆర్ఎస్ కు 37 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. ఆ లెక్కన కూడా 93 మందికే పరిమితం అవుతుంది టీఆర్ఎస్ బలం. టీఆర్ఎస్ మేయర్ ని డిసైడ్ చేయాలి అంటే మరో 9 మంది సపోర్ట్ కావాలి. రాజకీయం వేడెక్కింది. హంగు కావడంతో ఇంకా వేడిగా ఉన్నాయి హైదరాబాద్ రాజకీయాలు.
