Top Ad unit 728 × 90

జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌...!

జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌...!

 

గ్రేటర్హైదరాబాద్ మున్సిపల్కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్విడుదల చేసింది. నవంబర్‌ 7 జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది. మేరకు పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్కుమార్‌, లోకేశ్కుమార్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) పార్థసారథి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ప్రకారం నవంబర్‌ 9 జీహెచ్ఎంసీ కమిషనర్‌, 10 సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. నవంబర్‌ 11 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనునున్నారు. నవంబర్‌ 13 తుది జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్లడించింది.

 

జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *