Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

భారీగా తగ్గిన బంగారం ధర...!

భారీగా తగ్గిన బంగారం ధర...!

 

 

గతకొద్ది రోజుల నుండి బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. అయితే తాజాగా రెండు రోజుల నుండి బంగారం ధర స్వల్పంగా తగ్గు ముఖం పట్టింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు 2 శాతం పడిపోయాయి. అయినప్పటికీ 2,000 డాలర్లకు పైగా ఉంది. స్పాట్ గోల్డ్ 2,072 పలికిందని నిపుణులు తెలిపారు. ఇంకా అమెరికాలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టడం, అమెరికా డాలర్ తిరిగి పుంజుకోవడం వంటి వివిధ కారణాలు ఇందుకు కారణమైందన్నారు. దేశీయ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఇయర్‌లో బంగారం ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్లు ఢీలపడ్డాయి.



అయితే శుక్రవారం ఎంసీఎక్స్‌లో పసిడి దాదాపు రూ.1,000 వరకు తగ్గి రూ.54876కు స్థిరంగా ఉంది. అయితే అంతకుముందు సెషన్‌లో పసిడి 10 గ్రాములు రూ.56,191కు చేరుకున్న విషయం విదితమే. వెండి ఫ్యూచర్స్ 2 శాతం తగ్గి రూ.74,483కు పరిమితమైంది. అంతకుముందు కిలో రూ.77,949కు చేరుకున్న విషయం తెలిసిందే. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ తాత్కాలికంగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని నిపుణులు తెలిపారు.



ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇన్వెస్టర్లు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో మాత్రం బయట బంగారానికి డిమాండ్ బాగా పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణాలు పెరుగుతున్న ధరలు, ప్రజల చేతిలో నగదు లేకపోవడమే ప్రధాన కారణాలు. అయితే కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు కూడా ప్రస్తుతం ధరలను చూసి వెనుకంజ వేసే పరిస్థితి. దీంతో రిటైల్ మార్కెట్ లేకుండా పోయింది. ఇక తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి త్వరలో రూ.60వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.59వేలకు చేరుకుంది. నిన్న రూ.58,700 పలికింది. ఈ రోజు (ఆదివారం) ఓ సమయంలో రూ.59,000 మార్క్ కూడా అందుకుంది. రూ.60వేలు చేరడానికి మరో రూ.వెయ్యికి అటుఇటుగా ఉంది.
 

భారీగా తగ్గిన బంగారం ధర...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *