Top Ad unit 728 × 90

అశ్వ గంధ పొడిని ఇలా ఉపయోగించారంటే...!

అశ్వ గంధ పొడిని ఇలా ఉపయోగించారంటే... ఆయుష్షు పెరగడం ఖాయం.

 

ఆయుర్వేదంలో అశ్వ గంధకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అనేక అనారోగ్య సమస్యలన్ని తగ్గించడంలో అశ్వ గంధ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. పూర్వం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో అశ్వ గంధను తీసుకునేవారు.

 

దీన్ని తీసుకుంటే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అశ్వ గంధ పొడిని తీసుకుంటే ముఖ్యంగా అకాల మరణం అనేది సంభవించదు. ప్రస్తుత కాలంలో చాలా మంది అకాల మరణంతో మరణిస్తున్నారు. అలా కాకుండా తమ ఆయుష్షును ఈ పొడితో పెంచుకోవచ్చు. అశ్వ గంధతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో ప్రాణాంతక రోగాలు రాకుండా కాపాడుతుంది. దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

గుండె ఆరోగ్యం:

అశ్వ గంధ పొడి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రతి రోజూ ఈ పొడి తీసుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ తగ్గుతాయి. రక్త పోటు కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి అనేది తగ్గుతంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

 

సంతానోత్పత్తికి అవకాశాలు:

అశ్వ గంధ పొడిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తికి కూడా అవకాశాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌ని పెంచుతుంది. మహిళలు గర్భం ధరించే అవకాశాలను కూడా పెంచుతుంది.

 

కండరాల బలం:

అశ్వ గంధ పొడిని తరచూ తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా, దృఢంగా తయారవుతాయి. బలహీనంగా పురుషులు కండరాలు పెంచుకోవాలంటే.. అశ్వ గంధ పొడిని తీసుకుంటే చాలని పలు అధ్యయానాలు కూడా చెబుతున్నాయి. అథ్లెట్లు, ఫిట్ నెస్‌ని పెంచుకునేవారు దీన్ని సప్లిమెంట్‌గా తీసుకోవచ్చు.

 

డయాబెటీస్ కంట్రోల్:

అశ్వ గంధ పొడిని తరచూ తీసుకుంటే డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ఇన్సులిన్ స్రావాన్ని మెరుగు పరచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగు పరుస్తుంది.

 

జ్ఞాపక శక్తిని పెంచుతుంది:

జ్ఞాపక శక్తి అనేది ఎవరికైనా అవసరమే. ముఖ్యంగా చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. కాబట్టి పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి ప్రతి రోజూ ఇది ఇస్తే సరిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

 

ఇలా తీసుకోండి:

అశ్వ గంధ పొడి ఇప్పుడు సప్లిమెంట్స్ రూపంలో కూడా లభ్యమవుతుంది. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేడి పాలు లేదా గోరు వెచ్చటి నీళ్లలో పావు స్పూన్ ఈ పొడి కలుపుకుని తీసుకుంటే మంచిది.

 

అశ్వ గంధ పొడిని ఇలా ఉపయోగించారంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *