Top Ad unit 728 × 90

ఔనా కర్పూరం అంత మంచిదా…?

ఔనా కర్పూరం అంత మంచిదా…?

ఒక ఎంతో మంచి మనిషిని పది మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిత్వం వున్న వారిని మనం ఆ మనిషి కర్పూరం లాంటి మనిషి అని అంటూ వుంటాం. అలా ఎందుకని అంటామో తెలియాలంటే కర్పూరంతో మనకు లభించే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. జాగ్రత్తగా పరిశీలించండి మరి.

కర్పూరాలలో 15 రకాలు ఉన్నప్పటికీ హారతి కర్పూరం, పచ్చ కర్పూరం చాలా ముఖ్యమైనవి. హారతి కర్పూరాన్ని శుభాకరమైనదిగా అనాదిగా ఎన్నో దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో భావిస్తారు. ఎంతో చక్కని మంచి పరిమాళాన్ని వెదజల్లే ఈ కర్పూరాన్ని దేవాలయాల్లో పూజల్లో వాడతారు. భగవంతుడిక్లి హారతి ఇచ్చేందుకు ఈ పదార్థాన్ని వినియోగిస్తారు. పూజలో ఇదొక అమూల్యమైన పదార్థం.


కాని మనలో చాలా మందికి తెలియని విషయం ఏవిటంటే, పచ్చ కర్పూరం మన శరీరానికి మంచి ఔషదం. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని గాగే నీటిలో కూడా వేసొ ఉపయోగిస్తుంటారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం.
 

కర్పూరం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.

కర్పూరం ప్రయోజనాలు…!

 

1. స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద బాక్టీరియా సహజంగానే శుభ్రమౌతుంది.

2. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు దరిచేరవు.

3. వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం ఒక పది చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి నేల మీద డైనింగ్ టేబుల్స్ మీదా మన రోజూ వండుకునే గాస్ స్టవ్ దగ్గరా వంట చేసుకునే స్థలంలోనూ తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.

4. టూత్ బ్రష్ మీద దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుబ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి.

5. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె లో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదు.

6. మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.

7.కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డ లో చుట్టి రాత్రి పడుకునేముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది .శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి.

8. మనిషిలోని అన్ని ఆర్గాన్స్ నీ పరిశుభ్రం చేసే శక్తికూడా దీనికి వుందని చెప్తున్నారు.

9. దురద తగ్గడానికి కొద్దిగా కర్పూరం తీసుకుని, కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. కర్పూరం పూర్తిగా కరిగిన తర్వాత ముఖం, శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

10. కర్పూరం పాదాల పగుళ్ళను నివారిస్తుంది: పొడిబారిన, పగిలిన పాదాలను నివారించడంలో కొబ్బెరి నూనెలో వేసిన కర్పూరం చాలా సహాయపడుతుంది. పాదాల పగుళ్ళ సమస్యను పూర్తిగా నివారించడంలో ఈ కర్పూరం నూనెను వేడి నీళ్ళలో వేసి ఆ నీటిలో పాదాలను అరగంట ఉంచాలి. ఆ తర్వాత నీటిలో నుండి బయటకు తీసి, పొడి టవల్ తో తుడవాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చేస్తే మంచి నిద్రకూడా పడుతుంది.

11. కర్పూరం మొటిమలను కూడా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. పది తులసి ఆకులు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి అందులో చిటికెడు పచ్చ కర్పూరం వేసి రెండు నుంచి మూడు చెంచాల తేనె వేసుకుని రెండు గ్లాసుల వేడినీటిలో వేసుకుని ప్రతి రోజూ రాత్రి తాగాలి. ఉదయం పూట ప్రతి రోజూ అదే మిశ్రమాన్ని తర్వాత అందులో రెండు మూడు చుక్కల కర్పూరం కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. అరగంట ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తులసి, ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మొటిమలు సులభంగా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు.

12. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది.

13. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలి అంటే పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగివేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

14. చిటికెడు కర్పూరం అయిదు వెల్లుల్లి పాయ రెబ్బలలో వేసి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం వృద్ది చెందుతుంది.

15. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు. కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రా వంటి పదార్ధాన్ని సైడ్ ఎఫెక్టులు లేని దానిని మీ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి పొడిగా చేసుకుని ఆ పొడిని పడుకోబోయే ముందు ఒక చిన్న చెంచాడు వేసుకుని వేడి తేనె నీటిలో వేసుకుని ఒక తాగడం వల్ల లైంగిక సామర్ద్యం కూడా పెరుగుతుంది. వీర్యవృద్ధిని కూడా పెంచుతుంది.

16. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస్త వెన్నను కాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి.

పంచదారను, పసుపుగా వుండె బెల్లం, కృత్రిమ ఉప్పునూ వాడరాదు. వాటి బదులుగా సైందవలవణాన్ని తేనెనూ నల్ల బెల్లం, తాటి బెల్లం ను సమృద్దిగా ఉపయోగించుకోవచ్చు. అల్లం మసాలా మసాలా దినుసులు ఎర్ర కారం పూర్తిగా నిషేధం.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఔనా కర్పూరం అంత మంచిదా…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *