Top Ad unit 728 × 90

అల్లంలో ఈ నూనె కలిపి రాస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

అల్లంలో ఈ నూనె కలిపి రాస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

 

జుట్టు రాలడమనేది నేను చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్. దీనికి చెక్ పెట్టేందుకు అల్లం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

 

అల్లం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే అల్లంతో అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా అల్లంని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది. దానికోసం ఏం చేయాలో తెలుసుకోండి.

 

అల్లంలోని గుణాలు...

అల్లంని మనం రోజూ అనేక రకాలుగా వాడతాం. కూరల్లో వాడతాం. అల్లం టీ వాడతాం. ఇందులో గొప్ప గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా స్కాల్ప్‌ని హెల్దీగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, మినరల్స్ అన్నీ కూడా స్కాల్ప్ ఇరిటేషన్‌ని దూరం చేసి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. దానికోసం అల్లాన్ని ఎలా వాడాలంటే...

 

జుట్టు పెరిగేందుకు టిప్స్...

జింజర్ హెయిర్ మాస్క్...

కావాల్సిన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ అల్లం పౌడర్

1 టేబుల్ స్పూన్ జొజొబా ఆయిల్

 

ఏం చేయాలి...

ముందుగా...

జొజొబా ఆయిల్, అల్లం పొడిని కలిపి పేస్టులా చేయాలి.

దీనిని తీసుకుని స్కాల్ప్‌పై అప్లై చేయాలి.

తర్వాత సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.

30 నిమిషాల పాటు అలానే ఉంచండి.

ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ రాయండి.

దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

 

చుండ్రుని దూరం చేసేందుకు...

కావాల్సిన పదార్థాలు...

3, 4 చుక్కల పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్

2 టేబుల్ స్పూన్ ఆయిల్(కొబ్బరి, ఆలీవ్, ఆముదం )ఏదైనా తీసుకోవచ్చు.

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

 

ఏం చేయాలి.

ముందుగా పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్, అల్లం పొడి, నూనె, నిమ్మరసం తీసుకుని పేస్టులా కలపాలి.

ఈ పేస్టుని స్కాల్ప్‌పై అప్లై చేయండి. తర్వాతర షవర్ క్యాప్ వేసుకుని అరగంట వరకూ ఉండాలి.

తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

 

బెనిఫిట్స్...

అల్లంని జుట్టుకి వాడితే రక్తప్రసరణ మెరుగై కుదుళ్ళు బలంగా మారి జుట్టు పెరుగుతుంది.

అల్లంలోని విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ కారణంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

అల్లంని జుట్టుకి రాయడం వల్ల స్కాల్ప్ హెల్దీగా మారి దురద, ఇరిటేషన్‌ దూరమవుతుంది.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా తెల్లబడడం తగ్గుతుంది. దీంతో పాటు జుట్టు మెరుస్తుంది.

అల్లంలోని యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాల కారణంగా చుండ్రు దూరమవుతుంది.

 

అల్లంలో ఈ నూనె కలిపి రాస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *