Top Ad unit 728 × 90

పరగడపున అల్లం నీరు తాగితే బరువు తగ్గడమే కాదు...!

పరగడపున అల్లం నీరు తాగితే బరువు తగ్గడమే కాదు... ఈ బెనిఫిట్స్ కూడా.

 

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం నీరు మరీ మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే ఏయే లాభాలున్నాయో

 

అల్లం... ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వాడతాం. కూరల్లో ఎక్కువగా వాడే ఈ అల్లం రుచిగా ఉండడమే కాదు... ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ అల్లం నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియ మెరుగ్గా మారడం వరకూ చాలానే లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

 

ముందుగా ఓ పెద్ద అల్లం ముక్కని తీసుకోండి. దానిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఓ గ్లాసు నీటిని మరిగి అందులో తరిగిన అల్లం వేయండి. వాటన్నింటిని బాగా మరిగించండి. ఆ తర్వాత వడపోసి గోరువెచ్చగా అయ్యాక తాగండి.

 

ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే దీర్ఘకాలిక మంట ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు ఈ మంట, కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ఇది తాపజనక పరిస్థితులకి సహజ నివారణిగా పనిచేస్తుంది.

 

ఇమ్యూనిటీని పెంచడంలో కూడా అల్లం ముందుంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నిరోధించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అల్లంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో మొత్తం ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే చాలా మంచిది.

 

అధిక బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా అల్లం నీటిని తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జీవక్రియలు మొదలవుతాయి. ఊబకాయం తగ్గుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. రోజంతా ఎక్కువగా తినడం వంటి సమస్యలని దూరం చేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు.

 

అల్లం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. ఎన్నో రోజుల నుంచి జీర్ణ సమస్యల్ని దూరం చేయడానికి అల్లాన్ని వాడుతున్నారు. అల్లం ఆహారాన్ని కడుపు నుండి చిన్న ప్రేగులకి తరలించేందుకు హెల్ప్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆపానవాయువుని కూడా తగ్గిస్తుంది. ఇందులో జింజెరోల్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థని హెల్దీగా చేస్తాయి.

 

పరగడపున అల్లం నీరు తాగితే బరువు తగ్గడమే కాదు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *