Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

మీ నుదుటిమీద ఏర్పడిన ముడుతలను తొలగించుకోవడం ఎలా…?

మీ నుదుటిమీద ఏర్పడిన ముడుతలను తొలగించుకోవడం ఎలా…?
 

తరచుగా ముఖం చిట్లించి చూస్తున్నారా...? ఇటువంటి చర్యలు మీ ముఖం మీది చారలకు, ముడుతలకు కారణంగా మారొచ్చు. కాని వృద్ధాప్యం, చర్మం స్థితిస్థాపకత తగ్గడం, సూర్యరశ్మి ప్రభావం, జన్యుసంబంధ సమస్యలు, అసంబద్ద జీవనశైలి, అనారోగ్య ఆహార ప్రణాళికలు కూడా చర్మం మీది ముడుతలకు కారణం కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ఆ ముడతలను కప్పడానికి, తరచుగా మీ స్టైలిస్ట్ లేదా బ్యూటీషియన్ వద్దకు వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే, రసాయనాల అధిక వాడకం మీ చర్మాన్నిఅనేక ఇతరత్రా సమస్యలకు గురిచేసే అవకాశం లేకపోలేదు. కానీ, కొన్నిఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, సాధారణ సౌందర్య సాధనాలతోనే ఈ ముడతల నుండి ఉపశమనం పొందొచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

 

మీ నుదిటి మీద ముడుతలను తగ్గించడానికి అనుసరించదగిన 5 జీవనశైలి మార్పులు: మీ జీవనశైలి విధానాలు, మీ చర్మ ఆరోగ్యం మీద ముడతల అభివృద్ధిపై విపరీతమైన ప్రభావాన్ని చూపగలవు. మీ చర్మం మృదువుగా ఉండటానికే కాకుండా, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి క్రింది అంశాలను పాటించండి.
 

సూర్యరశ్మితో జాగ్రత్తగా ఉండండి: సూర్యుని అతినీలలోహిత కిరణాల కారణంగా, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అకాల వృద్ధాప్యం, ముడుతలకు దారితీస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, రోజువారీ వినియోగంలో భాగంగా, SPF 15 లేదా అంతకన్నా ఎక్కువగల సన్‌స్క్రీన్ వినియోగించడం, మీ చర్మ వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా, సన్ స్క్రీన్ వినియోగించడం, నల్ల మచ్చలు, ముడతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

ఒత్తిడిని నిర్వహించండి: చింత, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు మీ నుదుటి మీద ముడతలకు దారితీస్తుందని అనేక అధ్యయనాలలో తేలింది. అన్నివేళలా ఒత్తిడిని నిర్వహించడం అసాధ్యమైన విషయం. కానీ, ఒత్తిడిని అదుపులో ఉంచడం మాత్రం తప్పనిసరి. ఇది దీర్ఘకాలికంగా మీ చర్మ స్థితిస్థాపకతను నిర్వహించడంలో సహాయపడుతుంది. ధ్యానం, యోగా సాధన, డయాఫ్రాగ్మాటిక్ బ్రీథ్, అరోమా థెరపీ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడం, తగినంత నిద్ర, థెరపిస్ట్ తో మాట్లాడటం, జర్నలింగ్, రోజూవారీ వ్యాయామం వంటివి మీ ఒత్తిడిని నిర్వహించడంలో సహాయపడుతాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి: పొడి చర్మం నుదుటి మీద ముడతలను ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి వీలైనంత హైడ్రేటెడ్ గా ఉండడానికి ప్రయత్నించండి. క్రమంగా, ఈ అలవాటు నుదిటి మీది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని లోపలి నుండి హైడ్రేట్ చేయడం ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు, ప్రతి రోజు కనీసం ఎనిమిది 8 ఔన్సు గ్లాసుల ద్రవాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, మీరు వ్యాయామం చేసేటప్పుడు, లేదా ఎండలో గడిపినప్పుడు, నీటిని తరచుగా, వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది. నిమ్మకాయ లేదా ఫ్రూట్ ఇన్ఫ్యూజర్ ఉపయోగించడం ద్వారా మీరు ఫ్లేవర్స్ తో నీటిని తీసుకోవచ్చు. కనీసం గంటకు గ్లాసు నీళ్ళైనా తీసుకునేలా ప్రణాళిక చేసుకోవడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.
 

సమతుల్య ఆహారాన్ని తీసుకోండి: నుదిటి మీది ముడతల విషయానికి వస్తే, "మీరేంటో మీరు తినే ఆహారం నిర్ణయిస్తుంది" అన్న సామెత మీద మీ శరీరానికి సంబంధించిన కొన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి. 2007 పరిశోధనల ప్రకారం, చర్మ వృద్ధాప్యంలో ఆహారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. విటమిన్ సి, లినోలెనిక్ ఆమ్లం (ఒమేగా-3 కొవ్వు ఆమ్లం) సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా, అమెరికన్ మహిళల్లో, ముఖ్యంగా మధ్య వయస్కులలో ఈ పొడిచర్మం ప్రమాదం తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు. విటమిన్ సి కూడా ముడతలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఆహార అలవాట్లలో భాగంగా, కొవ్వు, పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమనేది ముడతలు, చర్మ క్షీణత ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించేలా చర్యలు తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. అంతేకాకుండా, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బోనేటెడ్ పానీయాలు, సోడాలు, నిల్వ ఉంచిన పదార్ధాలు వంటివి కూడా చర్మం మీద ప్రభావాలను చూపుతాయి. కావున, వీలైనంతగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పోషకాలతో కూడిన డైట్ అనుసరించడం మంచిదిగా సూచించబడుతుంది. మార్కెట్లో ఎందరో అనుసరిస్తున్న ఆహార ప్రణాళికలు అందరికీ సరిపోతాయని చెప్పడానికి లేదు. ఇవి వారివారి శరీరతత్వాలను, ఆరోగ్యాన్ని అనుసరించి ఉంటాయి. కావున మీకు సరిపడే ఆహార ప్రణాళికకోసం మీ న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టరుని సంప్రదించండి.
 

ధూమపానం/మద్యపానం నివారించండి మీరు ధూమపానం/మద్యపానం మానేయడానికి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎంఫిసెమా, గుండె జబ్బుల ప్రమాదమే కాకుండా, అకాల వృద్ధాప్యం, నుదిటి మీద ముడుతలకు కూడా కారణంగా మారుతుందని పరిశోధనల్లో తేలిన నిజం. ముఖ్యంగా అకాల వృద్ధాప్యం, నుదుటి మీద ముడుతలకు ధూమపానం ప్రధాన కారణంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 2008లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం, పొగాకు పొగలోని రసాయనాలు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది నెమ్మదిగా చర్మం స్థితిస్థాపకతను దెబ్బతీస్తుంది. క్రమంగా, అకాల వృద్ధాప్యం, ముడుతలకు దారితీస్తుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

 

 

మీ నుదుటిమీద ఏర్పడిన ముడుతలను తొలగించుకోవడం ఎలా…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *