Top Ad unit 728 × 90

ఈ పండ్లను అధికంగా తింటున్నారా…?

ఈ పండ్లను అధికంగా తింటున్నారా…?

 

ఏదైనా మోతాదుకు మించితే విషం కన్నా డేంజర్‌. అలాగే స్ట్రాబెర్రీ పండ్లలా అనిపించిఏ లిచీ పండ్లను చూస్తే నోరూరిపోతుంది. వీటిని తినకుండా కంట్రోల్ చేసుకోవడం కాస్త కష్టమే. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తింటే పెద్ద ముప్పే అంటున్నారు. లిచీ పండ్లను కొన్ని సమయాల్లో తినడం వల్ల కొన్ని సమస్యలు కోరి తెచ్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిచీ పండ్లు తినడం వల్ల ప్రయోజనాలేంటి…? అనర్థాలు ఏంటో…? ఇప్పుడు తెలుసుకుందాం.

 

జరిగే అనర్థాలు: అన్నీ పండ్లతో పోలిస్తే లిచీలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో అసలు తినకూడదు. అందులో పచ్చిగా ఉన్నపండ్లను అసలు ముట్టుకోవద్దు అంటున్నారు. ఇటీవల మార్కెట్లో దొరికే లిచీ పండ్లను ఎర్రని రంగు వేసి అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల్ని వీటి జోలికి పోనీకుండా చేయాలి.

 

ఇందులో ఉండే ఎక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ వల్ల మెదడువాపుకు దారితీస్తుంది. ఈ పండులో ఉండే విషపదార్థం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అంతేకాదు ఉష్ణోగ్రత వల్ల కూడా లిచీ పండ్లు విషతుల్యం అవుతాయి.

 

లిచీ పండ్లలో ఉండే 'హైపోగ్లైసెమిక్ ఎన్‌సెఫాలోపతీ' వల్ల రక్తంలో చక్కెర శాతం ప్రమాద స్థాయికి పడిపోతుంది.

 

గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం.

 

ఉపయోగాలు:

లిచీపండ్లు మితంగా తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా లిచీలో ఉన్నాయి

 

జీర్ణ సమస్యలను తీర్చడంలోనూ లిచీ బాగా పనిచేస్తుంది.

 

ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ లిచీ మంచిదే.

 

లిచి పండ్లను తింటే బరువు కూడా తగ్గుతారు.

 

గుండెను ఆరోగ్యం ఉంచేందుకు అవసరమైన పాలిపినాల్స్ లిచీలో అధికంగా ఉన్నాయి.

 

పాలిపినాల్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి.

తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరిచేందుకు లిచీ సహకరిస్తుంది.

శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నానశనం చేస్తుంది.

 

లిచీపండ్లు తినడం వల్ల అలర్జీలు, మరే ఇతర సమస్యలు ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఈ పండ్లను అధికంగా తింటున్నారా…? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *