మళ్లీ మారిన బ్రిటన్ వైరస్…!
మళ్లీ మారిన బ్రిటన్ వైరస్…!
వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తున్న బ్రిటన్ రకం కరోనా వైరస్, మరోసారి ఉత్పరివర్తనం చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణ ఇంగ్లండ్‌లోని వెలుగుచూసిన ఈ 'కెంట్' వైరస్ నమూనాలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ పరిశోధకులు తాజాగా పరిశోధన సాగించారు. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో కనిపించిన 'ఈ484కె' రకం వైరస్‌తో కలిసి కెంట్ ఉత్పరివర్తనం చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమీక్షించాల్సి ఉంది. ఈ484కెతో ఉత్పరివర్తనం చెందిన వైరస్ ప్రస్తుతానికి కొద్దిమందికి మాత్రమే సోకింది. అయితే, ఈ రకం వైరస్‌పై వ్యాక్సిన్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండవచ్చని భావిస్తున్నాం. కరోనా వైరస్‌లో కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తదుపరి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. 80 ఏళ్ల వృద్ధులు రెండు డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకుంటేనే వారికి మహమ్మారి నుంచి తగిన రక్షణ లభిస్తుందని కూడా మా పరిశోధనలో తేలిందని కేంబ్రిడ్జ్ పరిశోధకుడు ప్రొఫెసర్ రవి గుప్త తెలిపారు.
