Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ప్రాణాలను హరించే మరో కొత్త వైరస్‌…!

ప్రాణాలను హరించే మరో కొత్త వైరస్‌…!

 

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో వైరస్‌లపై పరిశోధనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఆ వైరస్ కూడా మనుషులకు ప్రాణాంతకంగానే మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కొత్తగా కనుగొన్న వైరస్ జన్యువులు గతంలో బయటపడ్డ వైరస్ జన్యువులతో సరిపోలడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ మినా గెరాయిస్‌లో వైరాలజిస్టుగా పనిచేస్తున్న జోనాతాస్ అబ్రహావ్ అతని బృందం వైరస్‌లు బ్రెజిల్‌కు కేరాఫ్ అన్నట్లుగా పరిణమించాయని చెబుతున్నారు.

కొన్ని వైరస్‌లు బ్యాక్టీరియా సైజులో ఉన్నాయని ఇవి 2003లోనే కనుగొన్నట్లు చెప్పారు జోనాతాస్. ఇక కొత్త వైరస్‌లను కనుగొనేందుకు జోనాతాస్ బృందం స్థానికంగా ఉన్న చెరువుల వద్ద పరిశోధనలు ప్రారంభించింది. ఇక్కడైతే భారీ సైజులో ఉన్న వైరస్‌లతో పాటు బ్యాక్టీరియా సైజులో ఉన్న వైరస్‌లు కనొగొనే అవకాశం ఉందని చెప్పారు. ఇక భారీ సైజు వైరస్‌లకు యారావైరస్ అని నామకరణం చేశారు. యారావైరస్‌కు సంబంధించిన జన్యువులను స్టడీ చేసినప్పుడు వారు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ జన్యుక్రమం గతంలో కనుగొన్న ఏ ఒక్క వైరస్‌లతో సరిపోలలేదు.

ఇక ఇదే వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ఎలోడీ గెడిన్ పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదని చెప్పారు. ఆమె మురుగు నీరు, శ్వాసకోశ వ్యవస్థలో దాగి ఉన్న వైరస్‌లపై పరిశోధన చేస్తోంది. ఇక మురుగు నీటిలో ఉన్న 95శాతం వైరస్‌లు గతంలో వెలుగు చూసిన వైరస్‌లతో సరిపోలి ఉండవని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త వైరస్‌లను కనుగొంటూనే ఉన్నామని చెప్పారు.

నేషనల్ క్యాన్సర్ ఇన్స్‌టిట్యూట్‌లో పనిచేసే మరో శాస్త్రవేత్తల బృందం జంతువుల్లో ఉన్న వైరస్‌లపై పరిశోధనలు చేస్తోంది. ఈ వైరస్‌లు వృత్తాకారంలో ఉంటాయని బృందంలోని సైంటిస్టులు క్రిస్టోఫర్ బక్ మరియు మైఖేల్ తీస్జా చెప్పారు.వీటినే సర్క్యులర్ వైరస్‌గా పిలుస్తున్నారు. ఇక ఈ సర్క్యులర్ వైరస్‌లు మనుషుల్లో వ్యాధి కలిగించు సూక్ష్మ జీవుల్లో (pathogens) దాగి ఉన్నాయని చెప్పారు. అంతేకాదు సెర్వికల్ క్యాన్సర్‌కు దారితీసే హ్యూమన్ పాపిల్లోమావైరస్‌లలో కూడా ఉంటాయని కనుగొన్నారు. అంతేకాదు కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్లలో ప్రమాదకరమైన పాపిల్లోమావైరస్ బ్లాడర్ క్యాన్సర్‌కు దారితీస్తుందని చెప్పేందుకు తమ వద్ద రుజువులు ఉన్నాయని క్రిస్టోఫర్ బక్ చెప్పారు.

సర్క్యులర్ వైరస్‌లను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అధిక సంఖ్యలో మానవ కణజాలం, మరియు ఇతర జంతువుల నుంచి సేకరించిన వైరస్‌లను తీసుకుని స్క్రీన్ చేశారు. ఈ వైరస్‌ల జన్యుక్రమం కూడా ఇతర వైరస్‌లతో పోలిలేవని చెప్పారు.ఈ బృందం ఏకంగా 2500 సర్క్యులర్ వైరస్‌లను కనుగొనిందని వెల్లడించింది. ఇందులో 600 వైరస్‌లో సైన్స్‌కే కొత్తగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కనుగొన్న కొత్త వైరస్‌లో మనుషులకు ప్రాణాంతకంగా పరిణమించే వైరస్‌లు ఏవనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ వైరస్‌లు మనుషులకు ఎంతమేరకు హానికలిగిస్తాయనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మొత్తానికి వైరస్‌లు చాలా మిస్టరీతో కూడి ఉన్నవి. భూమిపై నివసిస్తున్న అతి సూక్ష్మమైన జీవులు. అయితే వైరస్‌లు మరొక హోస్ట్ వైరస్ లేకుండా మనుగడ సాగించలేవు అదే సమయంలో పునరుత్పత్తి కాలేవు. అయితే ఇది జీవరాశులని పిలువచ్చా అనేది శాస్త్రవేత్తలకు సవాలుతో కూడిన ప్రశ్న.

 

ప్రాణాలను హరించే మరో కొత్త వైరస్‌…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *