Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కరోనా చికిత్సలో రెమిడిస్వేర్ ప్రభావం శూన్యం...!

కరోనా చికిత్సలో రెమిడిస్వేర్ ప్రభావం శూన్యం...!

 

ఇప్పటి వరకూ కరోనా రోగుల చికిత్సలో బాగా ఉపయోగపడుతుందనుకుంటున్న రెమిడిస్వేర్ మందు వల్ల మాత్రం ప్రయోజనం లేదని తేలింది. రెమిడిస్వేర్ ఒక్కటే కాదు హడ్రాక్సీ క్లోరో క్విన్, లోపిన్వేర్, ఇంటర్ఫెరాన్ లాంటి మందులు కూడా కరోనా మరణాలను మాత్రం తగ్గించలేకపోతున్నాయని పరిశోధనలో వెల్లడి అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పీడితులపై వినియోగిస్తున్న నాలుగు యాంటీ వైరల్ డ్రగ్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన నిర్వహించింది. మార్చి 22 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మొత్తం ప్రపంచంలోని 30 దేశాలలో ఉన్న 405 ఆసుపత్రులలో 11,266 మంది రోగులపై పరిశోధన నిర్వహించగా నాలుగు మందులు వారిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని, వారి మరణాన్ని అడ్డుకోలేకపోయాయని తేలింది. వెంటిలేటర్ పై ఉంచిన వారికి మందులు ఇస్తున్నారని అవి ఎలాంటి ప్రభావం చూపకపోవడం వల్ల కరోనా రోగులు మరణిస్తున్నారని పరిశోధకులు వెల్లడించారు. ముందుగా వాడినా కూడా కరోనా రోగిని వెంటిలేటర్ వరకూ తీసుకువెళ్లే పరిస్థితి తప్పడం లేదని, అందువల్ల మందు పని చేయడం లేదనే విషయం వెల్లడి అవుతోందని వారు వివరించారు.

కరోనా చికిత్సలో రెమిడిస్వేర్ ప్రభావం శూన్యం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *