Top Ad unit 728 × 90

అబార్షన్ అయిందా…!

అబార్షన్ అయిందా…!

 

అబార్షన్ అనేది స్త్రీ జీవితంలో దురదృష్టకర సంఘటన. అబార్షన్ లో జరిగే దుష్ప్రభావాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీటిని తగ్గించే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

 

అబార్షన్ అనేది స్త్రీ జీవితంలో దురదృష్టకర సంఘటనగా పేర్కొనవచ్చు. చిన్న ఆపరేషన్ అయినప్పటికీ, దీని వలన స్త్రీ శరీరంలో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఫలితంగా ఆమె ఆరోగ్యం కుదుటపడటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో తీసుకునే ఆహారం స్త్రీ ఆరోగ్యాన్ని చాలా వరకు ప్రభావితపరుస్తుంది. వీరికి ఆరోగ్యాన్ని కుడటపరిచే ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.  

 

గర్భిణులకే కాదు, కుంకుమ పువ్వు అబార్షన్ జరిగిన తరువాత కూడా స్త్రీలకు సహాయపడుతుంది. అబార్షన్ లో కోల్పోయిన అన్ని రకాల విటమిన్ మరియు మినరల్ లను ఒకగ్లాసు పాలలో కుంకుమపువ్వు కలుపుకొని తాగటం ద్వారా తిరిగి పొందవచ్చు.

 

పుసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే అవునా! అబార్షన్ తరువాత స్త్రీ శరీరంలో ఇన్ఫెక్షన్, వాపులు మరియు నొప్పులు చాలా సాధారణం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే పసుపును రోజు పాలలో కలుపుకొని తాగటం వలన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. 

 

అబార్షన్ జరిగిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. స్త్రీ శరీరంలో జరిగే అంతర్గత గాయాలు మానటానికి అల్లం గొప్పగా పనిచేస్తుంది. అల్లంలో నయం చేసే గుణాలు పుష్కలంగా కలిగి ఉండే అల్లం రోగ నిరోధకతను పెంచటంతో పాటూ, ఇన్ఫెక్షన్స్ ను నివారస్తుంది.

 

అబార్షన్ జరిగిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్ లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి, ఇది హెల్తీ యూట్రస్ కు చాలా మేలు చేస్తుంది మరియు రోగ నిరోధకతను గా పెంచుతుంది.

 

అబార్షన్ అయిందా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *