Top Ad unit 728 × 90

ప్రెగ్నెన్సీలో మైగ్రేన్‌ వస్తే ఎలా

ప్రెగ్నెన్సీలో మైగ్రేన్‌ వస్తే ఎలా

మైగ్రేన్‌ అనేది చాలా కామన్‌గా చూసే తలనొప్పిలో ఒక రకం. చాలామందికి ఈ తలనొప్పితో వాంతులు, ఎసిడిటీ వస్తాయి. మైగ్రేన్‌ను సరిగ్గా కంట్రోల్‌ చేయకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. మైల్డ్‌ హెడేక్‌ అయితే నీళ్లు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం, పారాసిటమాల్‌ తక్కువ డోస్‌ మాత్ర వేసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు.

ఒత్తిడి వల్ల కూడా మైగ్రేన్‌ పెరుగుతుంది. రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ను అలవాటు చేసుకోవాలి. గర్భం దాల్చిన దగ్గర్నుంచే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్‌ చేయాలి. శ్రావ్యమైన సంగీతం వింటూండాలి. మైగ్రేన్‌ రావడానికి కారణాలు ఏముంటున్నాయో గుర్తించాలి. కొంతమందికి సమయానికి భోజనం చేయకపోయినా.. లేదా భోజనం స్కిప్‌ అయినా, నిద్రలేకపోయినా మైగ్రేన్‌ అటాక్‌ అవుతుంది.

ఈ ట్రిగ్గర్‌ పాయింట్లను గ్రహించి.. సమయానికి భోజనం.. 8– 10 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పారాసిటమాల్, వాంతులు తగ్గే మందులతో మైగ్రేన్‌ను చాలా కంట్రోల్‌ చేయవచ్చు. తరచుగా మైగ్రేన్‌ వచ్చే వాళ్లకు ప్రెగ్నెన్సీలో ప్రభావం చూపని సురక్షితమైన మందులను డాక్టర్లు సూచిస్తారు. వాటిని ఎలా వాడాలో కూడా చెబుతారు. మీరు ఆల్‌రెడీ మైగ్రేన్‌కి మందులు వాడుతున్నట్లయితే.. అవి ప్రెగ్నెన్సీలో సేఫ్‌ అవునో కాదో మీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి.

Brufen, Ergotamine వంటి మందులు అసలు వాడకూడదు. ఆరవ నెల తర్వాత పెయిన్‌ కిల్లర్స్‌ వంటివి వాడకూడదు. ఎపిలెప్సీ మందులను కొంతమంది మైగ్రేన్‌కి కూడా వాడుతుంటారు. అలాంటివి మీరు వాడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వాటివల్ల పొట్టలో బిడ్డకు బర్త్‌ డిఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది విషయంలో న్యురాలజిస్ట్‌ అభిప్రాయం తీసుకుని మందులు మార్చటం జరుగుతుంది.

 

ప్రెగ్నెన్సీలో మైగ్రేన్‌ వస్తే ఎలా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *