Top Ad unit 728 × 90

టీకా అవసరం లేకుండానే కరోనా ఖతం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

టీకా అవసరం లేకుండానే కరోనా తగ్గిపోతుందన్న ఆశ భారత ప్రజల్లో మెల్లిమెల్లిగా పెరుగుతోంది. అభిప్రాయాన్ని బలపరుస్తూ కరోనాకి టీకా అవసరం లేని దశకు చేరుకుంటున్నామని, టీకా వచ్చేలోపు భారత్ లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి కంటే ముందే భారత దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంటే టీకా అందుబాటులోకి రావడానికంటే ముందుగానే టీకా తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు మనలో కలుగుతాయన్నమాట. కొవిడ్ ని నిరోధించే యాంటీబాడీస్ మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గతంలో హెర్డ్ ఇమ్యూనిటీ అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ చుట్టుముట్టే ఇలాంటి మహమ్మారులు హెర్డ్ ఇమ్యూనిటీతోనే అంతమవుతాయని వైద్య శాస్త్ర వేత్తలు తేల్చి చెప్పారు. అంటే దాదాపుగా సమాజంలో మూడు వంతుల మందికి కొవిడ్ సోకితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం భారత్ లో ఇదే జరిగినట్టు తెలుస్తోంది.

కరోనా వచ్చిన విషయం తెలియకుండానే చాలామందిలో తగ్గిపోతోంది. యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకుంటే విషయం బైటపడుతోంది. కొవిడ్ యాంటీబాడీస్ ఉన్నవారందరికీ కరోనా వచ్చిపోయినట్టే లెక్క. అంటే చాలామందిలో యాంటీబాడీస్ వృద్ధి చెందినా కూడా వారిలో కొవిడ్ లక్షణాలేవీ కనిపించలేదట,
కనీసం పారా సెట్మాల్ కూడా వాడకుండానే కొవిడ్ వచ్చి దానంతట అదే తగ్గిపోయింది. కొవిడ్ నుంచి చికిత్స ద్వారా కోలుకున్నవారు, అసలు చికిత్సే లేకుండా కొవిడ్ వచ్చిపోయిన వారు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్టే లెక్క. స్థితికి చేరుకుంటున్నాం కాబట్టి ఇక వ్యాక్సిన్ తో అవసరం ఉండకపోవచ్చనేది ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అభిప్రాయం.


మనం మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నామన్న దశకు చేరుకుంటున్నాం. దశలో టీకా అవసరం, దాని ప్రయోజనం ఉండదు. అయితే కొవిడ్ వైరస్ మార్పులు చెందితే, రీ ఇన్ఫెక్షన్ నివారించడానికి టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో వైరస్ స్పందించే తీరుని అంచనా వేస్తున్నాం. దాని ఆధారంగా ఎంత తరచుగా టీకా తీసుకోవాల్సి ఉంటుందో అర్థమవుతుంది' అని వెల్లడించారు గులేరియా.

ఇక టీకా విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పలు కంపెనీల టీకాలకు ఏడాది చివర్లోకానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఆమోదం లభించే అవకాశం ఉంది.
2021లో సాధ్యం అయినా, కాకపోయినా 2022 నాటికి టీకా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

టీకా అవసరం లేకుండానే కరోనా ఖతం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *