Top Ad unit 728 × 90

అమ్మాయిని ఎర వేసి అంతం చేశారు...!

అమ్మాయిని ఎర వేసి అంతం చేశారు...!

 

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన హనీట్రాప్ మర్డర్ కలకలం సృష్టిస్తోంది. కనిపించకుండా పోయిన వ్యక్తి హత్యకు గురైన విషయం ఆరు నెలల తర్వాత బయటకు వచ్చింది. ముమ్మిడివరం మండలం సి.హెచ్‌ గున్నేపల్లికి చెందిన రామకృష్ణ గత ఏడాది డిసెంబరు 8న కాకినాడ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఆరు నెలలు గడుస్తున్నా ఆయన ఆచూకీ లేకపోవడంతో అతని తల్లి వెంకాయమ్మ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు రామకృష్ణ హత్యకు గురైనట్లు తేల్చారు.

 

గత ఏడాది డిసెంబరు 11న కరప మండలంలోని అరట్లకట్ట-కరకుదురు రహదారిలోని పంట కాలువలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. అప్పట్లో అక్కడ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి రాయికట్టి ఉండడంతో హత్య చేసి కాలువలో పడేసినట్లు గుర్తించారు. రామకృష్ణ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో కరపలో హత్యకు గురైన వ్యక్తి ఆయనేనని గుర్తించారు. రామకృష్ణను ఓ యువతి ద్వారా మభ్యపెట్టి కాకినాడ రప్పించి హత్య చేశారు.

 

భూతగాదాల నేపథ్యంలో రామకృష్ణకు వరుసకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్ ఈ హత్యకు స్కెచ్ వేశాడు. అమ్మాయిని ఎరగా వేసి రామకృష్ణను ముగ్గులోకి దించాడు. గత ఏడాది డిసెంబర్ 8న అమ్మాయి ద్వారా రామకృష్ణను కాకినాడ రప్పించి దారుణంగా హత్య చేశాడు శ్రీనివాస ప్రసాద్. అనంతరం రామకృష్ణ మృతదేహాన్ని కరప మండలం అరట్లకట్ట సమీపంలో పంట కాలువలో పడేశారు. భూతగాదాలో ఒక సందర్భంలో శ్రీనివాస ప్రసాద్ ను రామకృష్ణ కొట్టడంతో అవమానభారంతో ఈ మర్డర్ కు స్కెచ్ వేశారని తేలింది.

 

రామకృష్ణ హత్య విషయం బయటకు రాకుండా నిందితుడు శ్రీనివాస ప్రసాద్ మరో నాటకం మొదలుపెట్టాడు. హత్యకు సహాయం తీసుకున్న అమ్మాయి చేత రామకృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించాడు. తాను రామకృష్ణను పెళ్లి చేసుకున్నానని తిరుపతిలో ఉన్నామని చెప్పించాడు. అప్పుడప్పుడు ఫోన్లు వస్తుండటంతో కుటుంబసభ్యులకు కూడా అనుమానం రాలేదు. అయితే ఆరు నెలలు అవుతున్నా రామకృష్ణ తిరిగి రాకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

అమ్మాయిని ఎర వేసి అంతం చేశారు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *