Top Ad unit 728 × 90

అంబులెన్స్‌లో అనుమానాస్పద పెట్టెలు తీరా తెరిచి చూస్తే...!

అంబులెన్స్‌లో అనుమానాస్పద పెట్టెలు తీరా తెరిచి చూస్తే...!

 

ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలోనో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సహా అక్కడి స్థానిక పార్టీలన్నీ ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాయి. అలాగే ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసులు ముమ్మరంగా నిఘా పెట్టారు. గుజరాత్‌లో నకిలీ నోట్ల చెలామణి పెరిగిపోయిందనే ఆరోపణలు, గత కొద్ది రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ పోలీసులు రూ.25 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫక్కీలో తరలిస్తున్న భారీ మొత్తంలో ఫేక్‌ మనీని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

 

సూరత్ నగరంలోని అహ్మదాబాద్-ముంబై హైవేపై అంబులెన్స్ అతి వేగంతో వచ్చింది. ఆ ప్రాంతంలో సోదాలు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన అంబులెన్స్‌ను అడ్డుకుని తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు చూసి ఖాకీలే అవాక్కయ్యారు. రూ. 25కోట్ల 80 లక్షల రూపాయలు అన్నీ రెండు వేల రూపాయల నోట్లే…పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడ్డ నోట్ల పై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండాల్సిన ప్రదేశంలో రివర్స్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరును ముద్రించిన్నట్లు పోలీసులు గుర్తించారు ఆరు పెట్టెల్లో రూ.25.80 కోట్ల విలువైన రూ.2000 నకిలీ నోట్ల 1290 ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు డ్రైవర్‌ను విచారించి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రంకు పెట్టెల్లో పట్టుబడ్డ నోట్ల పైన షూటింగ్ కొరకు అని వ్రాసివున్నట్టుగా గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నోట్లను ఎక్కడ ముద్రించారు, ఎవరికి డెలివరీ కోసం తీసుకెళ్లారు అనే విషయాలపై కూడా విచారణ చేపట్టినట్లు తెలిసింది.

 

అంబులెన్స్‌లో అనుమానాస్పద పెట్టెలు తీరా తెరిచి చూస్తే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *