Top Ad unit 728 × 90

జపాన్ దేశంలో ఓ భారతీయుడిని ఏకంగా దేవుడిగా పూజిస్తున్నారు. ఎందుకంటే...!

జపాన్ దేశంలో ఓ భారతీయుడిని ఏకంగా దేవుడిగా పూజిస్తున్నారు. ఎందుకంటే...!

 

భారత్‌కు చెందిన చాలా మంది యూరప్, అమెరికా దేశాల్లో గొప్ప వ్యక్తులుగా చెలామణి అవుతుండడం సహజమే. అయితే జపాన్ దేశంలో ఓ భారతీయుడిని ఏకంగా దేవుడిగా పూజిస్తున్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన జస్టిస్ రాధాబినోద్ పాల్. బహుశా చాలా మంది ఈయన పేరు కొత్తగా వినుంటారు. కానీ, జపనీయులకు మాత్రం ఈయన చాలా సుపరిచితుడు. అందుకే అక్కడి దేవాలయాల్లో ఆయన చిహ్నాలను స్థాపించి ఆరాధిస్తున్నారు.

 

ఇంతకీ ఈయన దేవుడు ఎందుకు పూజిస్తున్నారనే అనుమానం మీకు ఈపాటికి కలిగే ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, ప్రపంచ దేశాలన్నీ కలిసి జపాన్‌ను బోనులో నిల్చోబెట్టాయి. అయితే జస్టిస్ రాధాబినోద్ పాల్ ఒక్కరే జపాన్‌ను సమర్ధించారు. యుద్ధం జరిగాక చట్టాలు చేసి శిక్షించడం ఏంటని నిలదీశారు. రాధాబినోద్ వాదన గెలవకపోయినా ఆయన మాత్రం జపనీయుల హృదయాల్లో నిలిచిపోయారు.

 

అప్పట్లో ఆసియా-పసిఫిక్ దేశాలపై జపాన్ దండెత్తి అనేక ఘోరాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలోనూ ఇటలీ, జర్మనీలతో దుందుడుకుగా వ్యవహరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకవైపు భాగస్వామ్య పక్షాలైన జపాన్, ఇటలీ, జర్మనీ దేశాలు ఓటమి పాలయ్యాయి. అనంతరం జపాన్ చేసిన నేరాలకు తగిన శిక్షవేయాలని మిత్ర పక్ష కూటమి దేశాలు నిర్ణయించాయి. జపాన్ ప్రధాని సహా పాలకులు, సైన్యాధికారులతో పాటు వేలమందిపై హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం, ఆక్రమణల కింద కేసులు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకే టోక్యో ట్రయల్స్ బెంచ్ ఏర్పాటైంది.

 

11 దేశాల న్యాయమూర్తులతో కూడిన ఈ టోక్యో ట్రయల్స్ బెంచ్‌లో జస్టిస్ రాధాబినోద్ పాల్ ఒకరు. ఈ బెంచ్ నిందితులకు మరణశిక్షలు, జీవిత ఖైదులు విధించాయి. కాగా, నిందితులకు శిక్షలు విధించడాన్ని రాధాబినోద్ విభేధించారు. ఇలా విభేధించింది ఆయన ఒక్కరే. యుద్ధంలో జపాన్ దుందుడుకుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లేవని, యుద్ధ నేరాలు ఆ దేశ ప్రభుత్వ విధానం కాదని ఆయన వాదించారు. శత్రు దేశాలే జపాన్ ను రెచ్చగొట్టి యుద్ధ రంగంలోకి దింపాయని తేల్చాయని, అలాంటప్పుడు ఈ నేరంలో ఇతర దేశాల పాత్ర ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పైగా ఆ సమయంలో యుద్ధం చేయడం నేరం కాదనీ, ఘటన తర్వాత చట్టాలు చేసి శిక్షించడం సరికాదని, అందుకే నిందితులంతా నిర్ధోషులని రాధాబినోద్ అభిప్రాయపడ్డారు.

 

అయితే రాధాబినోద్ వానదలు టోక్యో ట్రయల్స్ బెంచ్‌లో నెగ్గలేదు. మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయమే తీర్పైంది. రాధాబినోద్ అభిప్రాయాల్ని జపనీయులు స్వాగతించారు. టోక్యో ట్రయల్స్ పూర్తైన తర్వాత కూడా ఆయన అనేకసార్లు జపాన్‌లో పర్యటించారు. అంతే కాదు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక ఆసియా దేశం జపాన్ అని ఓ సందర్భంలో ప్రశంసలు కూడా కురిపించారు. దీంతో ఆయన జపనీయులకు ఆరాధ్యుడు అయ్యారు. రాధాబినోద్‌కు అప్పటి జపాన్ చక్రవర్తి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ది సాక్రెడ్ ట్రెజర్ అవార్డు ప్రదానం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రతిమలు పెట్టి పూజించడం ప్రారంభై నేటికి కొనసాగుతోంది. ఇక భారత ప్రభుత్వం కూడా ఆయనను పద్మ విభూషన్ అవార్డుతో సత్కరించింది.

జపాన్ దేశంలో ఓ భారతీయుడిని ఏకంగా దేవుడిగా పూజిస్తున్నారు. ఎందుకంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *