Top Ad unit 728 × 90

జూమ్ కాల్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి, ఓ లాయరు మహిళతో...!

జూమ్ కాల్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి, ఓ లాయరు మహిళతో...!

 

'వర్క్ ఫ్రం హోం' చాలామంది ఉద్యోగులకు సవాల్‌గా మారింది. ఫ్యామిలీ టైంను, ఆఫీస్ టైంను బ్యాలెన్స్ చేయలేక పలువురు ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇక ఆఫీస్ వర్క్ నిమిత్తం వీడియో కాల్స్‌లో సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న ఓ ప్రముఖ వ్యక్తికి చర్చలో ఉండగా ఎదురైన చేదు అనుభవం గుర్తుండే ఉంటుంది. చేదు అనుభవం ఎదురైతే సరిపెట్టుకోవచ్చేమో కానీ సిగ్గుమాలిన పని చేస్తూ వీడియో కాల్ కారణంగా అడ్డంగా దొరికిపోతే, అలాంటి ఘటనే పెరూలో జరిగింది. పెరూలో వీడియో కాల్ ఓ న్యాయవాది కొంప ముంచింది. హెక్టర్ సిప్రియానో పరేడ్స్ రోబెల్స్ అనే పెరూకు చెందిన న్యాయవాది 'వర్క్ ఫ్రం హోం' లో ఉన్నాడు. కరోనా కారణంగా అక్కడి కోర్టులు కేసు విచారణలను వర్చువల్‌గా నిర్వహిస్తున్నాయి. ఓ లోకల్ గ్యాంగ్‌కు సంబంధించిన కేసు విచారణ వర్చువల్‌గా న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుండగా, ఆ వర్చువల్ విచారణలో రోబెల్స్ పాల్గొన్నాడు. తాను జూమ్ కాల్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి, కెమెరా ఆన్‌లో ఉందన్న స్పృహ కూడా లేకుండా ఓ మహిళతో రోబెల్స్ శృంగారంలో పాల్గొన్నాడు.

 

జూమ్ కాల్‌లో విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఆ అశ్లీల దృశ్యాలు చూసి బిత్తరపోయారు. వెంటనే విచారణ ప్రక్రియను నిలిపివేశారు. న్యాయమూర్తి వెంటనే రోబెల్స్ ఇంటికి ఓ పోలీసు అధికారిని పంపారు. శృంగార కార్యకలాపాలు కోర్టు విచారణలో కనిపిస్తున్నాయన్న విషయాన్ని రోబెల్స్‌కు తెలిసేలా చేశారు. రోబెల్స్ బాగోతంపై విచారణ జరపాలని న్యాయమూర్తి ఆదేశించారు. రోబెల్స్ ఇకపై ఎలాంటి కేసులు వాదించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రోబెల్స్ ఓ కేసులో సాయం నిమిత్తం తన వద్దకు వచ్చిన మహిళతో శృంగారంలో పాల్గొన్నట్లు తేలడం కొసమెరుపు. రోబెల్స్ చేసిన ఈ నిర్వాకం వల్ల ఉద్యోగపరంగానూ, కుటుంబపరంగానూ సమస్యలు ఎదుర్కోవాల్సిన సంకటంలో పడ్డాడు.

జూమ్ కాల్‌లో ఉన్నానన్న సంగతి మరిచిపోయి, ఓ లాయరు మహిళతో...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *