పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న హంద్వారా ఎన్కౌంటర్...!
పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న హంద్వారా ఎన్కౌంటర్...!
పాకిస్థాన్‌ను హంద్వారా ఎన్కౌంటర్ వెంటాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా ఎన్కౌంటర్లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సహా ఐదుగురు చనిపోయిన నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే అనుమానంతో పాకిస్థాన్ తమ గగనతలంలో విమానాలతో గస్తీ పెంచింది. రోజువారీ విమానాలతో పాటు ఎఫ్ -16, జేఎఫ్-17 వంటి యుద్ధ విమానాలతో గస్తీ చేపట్టింది.
హంద్వారా లాంటి ఎన్కౌంటర్లు, దాడులు జరిగినప్పుడల్లా భారత్ పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. యూరీలోని సైనిక శిబిరంపై దాడి, పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఖైబర్ ఫక్తుంక్వాలోని బాలాకోట్‌లో ఉన్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విరుచుకుపడ్డాయి. భారీ నష్టం కల్గించాయి. అందుకే పాక్‌ను ప్రస్తుతం హంద్వారా ఎన్కౌంటర్ భయం వెంటాడుతోంది.
లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి
దీనికి తోడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై 5 గంటలపాటు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఇమ్రాన్ సర్కారులో భయం పెరిగింది. భారత్ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోందనే అనుమానంతో అత్యంత అధునాతన యుద్ధ విమానాలతో గస్తీ పెంచింది.
లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి
దీనికి తోడు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమదే అని భారత్ మరోమారు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కారు ఏదో పెద్ద ఆపరేషన్ చేయబోతుందనే అనుమానాలు ఇమ్రాన్ సర్కారుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఉగ్రవాద శిబిరాలను నడుపుతోంది. హఫిజ్ సయీద్, లఖ్వీ, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల అధినేతలకు రక్షణ కల్పించడమే కాక తమ సైన్యం ద్వారా ఉగ్రవాదులకు శిక్షణ ఇప్పిస్తోంది. భారత్‌పైకి ఉసిగొల్పుతూ సరిహద్దు దాటిస్తోంది. పాక్ పన్నాగాలను వమ్ము చేసే యత్నాల్లో భాగంగా ఉగ్రవాదులతో పోరాడుతూ భారత సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. తాజాగా హంద్వారా ఎన్కౌంటర్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టిగా గుణపాఠం నేర్పాలని ఇండియన్ ఆర్మీ యోచిస్తోంది. ఈ సారి ఉగ్రవాద సంస్థల నాయకులనూ టార్గెట్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పాక్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ విమానాలతో సరిహద్దుల వద్ద గస్తీ పెంచి భారత భద్రతా బలగాల కదలికలను ఓ కంట కనిపెడుతూనే ఉంది. పాక్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోసారి సర్జికల్ దాడులు జరిపి ఇమ్రాన్ ఆర్మీతో పాటు ఉగ్రవాద సంస్థల వెన్ను విరవాలని ఇండియన్ ఆర్మీ యోచిస్తోంది.
లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి
