Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ట్రంప్‌కు కోపమొచ్చింది...!

ట్రంప్కు కోపమొచ్చింది...!

 

డెమొక్రాటిక్అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయని ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల కథనాన్ని ప్రచురించింది. హంటర్ మెయిల్లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. సమాచారం హంటర్కు చెందిన పాత కంప్యూటర్ను హ్యాక్చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్టైమ్స్పేర్కొంది. అయితే నిర్ధారణ కాని ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని పలు విమర్శలు రావడంతో ఫేస్ బుక్, ట్విటర్ వార్తకు సంబంధించిన లింక్లను బ్లాక్ చేశాయి. చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్మండిపడ్డారు. ట్రంప్వర్గం చర్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తన ప్రత్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన కథనాన్ని రెండు మాధ్యమాలూ కావాలనే సెన్సార్ చేశాయని అధ్యక్షుడు ట్రంప్ఆరోపించారు. కాగా, నిజానిజాలను నిర్ధారించుకోకుండా తాము కథనానికి సంబంధించిన లింక్లను పోస్ట్ చేయలేమని ట్విటర్ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా ట్విటర్తన నిర్ణయాన్ని బయటకు ప్రకటించకపోవటంతో వార్తను షేర్చేయటానికి ప్రయత్నించి విఫలమైన యూజర్లు అయోమయానికి గురయ్యారు.

ట్రంప్‌కు కోపమొచ్చింది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *