Top Ad unit 728 × 90

జైళ్ళలో ఉన్నవారిని విడిపించిన కరోనా…!

జైళ్ళలో ఉన్నవారిని విడిపించిన కరోనా…!

 

కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమవుతున్న ఇరాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో వ్యాధి వ్యాప్తి నిరోధించేందుకు 85 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇలా విడుదలైన వారిలో రాజకీయ ఖైదీలు కూడా ఉండటం గమనార్హం. అయితే, విడుదలైన వారు మళ్లీ జైళ్లకు ఎప్పుడు రావాలనేదానిపై ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇప్పటికే ఇరాన్ జైళ్లు ఖైదీలతో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్‌లో కరోనా ప్రబలడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ హెచ్చరిక జారీ చేసింది. అక్కడి జైళ్లో ఇపాటికీ అనేక మంది కరోనా బారిన పడి ఉండొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేస్తూన్నట్టు ప్రకటించింది. తాజా లెక్కల ప్రాకారం ఇరాన్‌లో మొత్తం 853 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం 14,991 కరోనా కేసులు నమోదయ్యాయి.

జైళ్ళలో ఉన్నవారిని విడిపించిన కరోనా…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *