Top Ad unit 728 × 90

District News :

సెక్యూరిటీ గార్డును ఈడ్చుకెళ్ళిన దెయ్యం...!

సెక్యూరిటీ గార్డును ఈడ్చుకెళ్ళిన దెయ్యం...!

 

మీరెప్పుడైనా దెయ్యాన్ని చూసారా…? ఈ ప్రశ్న వేస్తె చాలామంది నవ్వుకుంటారు. దెయ్యం ఏంటి నేను చూడటం ఏంటని సమాధానం చెబుతుంటారు. మరికొందరు అసలు దెయ్యాలే లేవని అంటుంటారు. అయితే దెయ్యాలు ఉన్నాయా లెవా అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కొందరు లేవంటే మరికొందరు ఉన్నాయంటారు. అయితే కొన్ని సార్లు నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎదో తెలియని అదృశ్య శక్తి వస్తువులను కదిలించినట్లుగా కనిపిస్తుంది. వాటిని చూసి చాలామంది భయపడతారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

కొలంబియా మేయర్ ఈ దెయ్యం అనుభవాన్ని చూశారు. కొలంబియాలో ఆర్మేనియన్ సిటీ మేయర్ జోస్ మాన్యూల్ రియోస్ మొరాల్స్ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ సీసీటీవీ ఫుటేజ్‌ని షేర్ చేశారు. అందులో ఘటనకు కారణం దెయ్యమే అని ఆయన చెబుతున్నారు. తన ఆఫీస్‌లోని సెక్యూరిటీ గార్డును దెయ్యం చితకబాదిందని చెప్పారు. మేయర్ పోస్ట్ చేసిన వీడియోలో సెక్యూరిటీ గార్డ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. పక్కన ఎవరు లేరు, కానీ ఎవరో తోసినట్లుగా ఒక్కసారిగా కిందపడ్డాడు. అక్కడి నుంచి పక్కకు లాగబడ్డాడు.

 

అయితే చుట్టూ చూసినా ఎవరు కనిపించకపోవడంతో అతడు వణికిపోయారు. భయపడుతూ దిక్కులు చూస్తుంటే… మళ్లీ దెయ్యం గట్టిగా ఒక్కటిచ్చింది. దాంతో వెనక ఉన్న ఏదో వస్తువుకి ధబేల్ మని తగులుకున్నాడు. ఆ తర్వాత ఆయన అరుపులు విని ఇద్దరు వ్యక్తులు గబగబా వచ్చినట్లు వీడియో ఉంది. ఇదంతా దెయ్యం పనే అంటున్నారు మేయర్. అయితే ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డ్ పక్కన ఎవరు కనపడలేదు. దెయ్యం అంటే నీడలా అయినా కనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో ఓ లైట్ వెలుతురూ పెద్దగా కనిపిస్తుంది. కనిపించని శక్తి ఏదో బలంగా కొట్టినట్లు అనిపిస్తోంది.

సెక్యూరిటీ గార్డును ఈడ్చుకెళ్ళిన దెయ్యం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *