Top Ad unit 728 × 90

అద్బుతం: ఇక మనుషులు 180 ఏళ్ళు బతకవచ్చట...!

అద్బుతం: ఇక మనుషులు 180 ఏళ్ళు బతకవచ్చట...!

 

అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త డేవ్‌ ఆస్ప్రే కు 47 ఏళ్లు. ఏకంగా 180 సంవత్సరాలు, అంటే 2153 సంవత్సరం వరకు బతుకుతానని బలంగా నమ్ముతున్నాడు. 180 ఏళ్లపాటు జీవించి ఉండటానికి తాను మూలకణ చికిత్స తీసుకుంటున్నట్టు ప్రకటించారు. శరీరంలోని పలు భాగాల్లోని బోన్‌ మ్యారో (ఎముక మజ్జ) నుంచి తీసిన మూల కణాలను తన శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్‌ చేయించుకున్నట్టు చెప్పారు. ఇలా చేయడం వల్ల తన ఆయుర్దాయం పెరిగి, 2153 వ సంవత్సరం వరకు జీవిస్తానని పక్కాగా చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ, శరీరంలో మూల కణాల సంఖ్య తగ్గుతందన్న డేవ్‌ ఆస్ప్రే, వాటిని తిరిగి శరీరంలోకి ఇంజెక్ట్‌ చేసుకోవడం ద్వారా జీవితకాలం పెరుగుతుందని వివరించారు. తాను ఎప్పుడూ యంగ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకోసమే ఈ చికిత్స తీసుకుంటున్నట్టు డేవ్‌ ఆస్ప్రే స్పష్టం చేశారు.

ఒక్క సిట్టింగ్‌కు 25 వేల డాలర్లు. 40 ఏళ్లలోపువారు తీసుకుంటే 100 ఏళ్లు గ్యారెంటీ. ఈ మూలకణ చికిత్సలో ఒక్క సిట్టింగ్‌కు 25 వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షలు) ఖర్చు చేస్తున్నట్టు డేవ్‌ ఆస్ప్రే వెల్లడించారు. 40 ఏళ్లలోపువారు, ఈ చికిత్స తీసుకుంటే 100 ఏళ్లు సునాయాసంగా బతికేయొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం తాను తీసుకుంటున్న ఈ మూలకణ చికిత్స, త్వరలో మొబైల్‌ ఫొన్ల మాదిరిగా పాపులర్‌ అయ్యి, ప్రజలకు అందుబాటులోకి వస్తుందని డేవ్‌ ఆస్ప్రే తెలిపారు.

అద్బుతం: ఇక మనుషులు 180 ఏళ్ళు బతకవచ్చట...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *