Top Ad unit 728 × 90

నిజమెంత: ఈ ఏడాదిలోనే భూగ్రహంపై జీవిరాశీ అంతం కానుందా...!

నిజమెంత: ఈ ఏడాదిలోనే భూగ్రహంపై జీవిరాశీ అంతం కానుందా...!

 

ఓ వైపు కరోనా వైరస్ వ్యాధి భూమిపై మానవుడి మనుగడకు సవాల్ విసురుతూ, వేలాది ప్రాణాలను బలితీసుకుంటున్న తరుణంలో ఈ ఏడాదిలోనే భూగ్రహంపై జీవిరాశీ అన్నది అంతం కానుందా...! అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఈ విషయాన్ని మూడేళ్ల క్రితం 2020లో భూమి అంతం కానుందని, ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందంటూ ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద గ్రహశకలం ఈ ఏప్రిల్‌ 19 భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గతంలో వెల్లడించింది. అయితే, ఆ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందన్నది ఆ ప్రచార సారాంశం. ఇందులో నిజమెంత...?

 

ఏప్రిల్‌ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందని మూడేళ్ల క్రితం నాసా వెల్లడించింది. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం (స్పేస్‌రాక్‌) భూమి నుంచి 1.8 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని ఓ వార్త సంస్థ తెలిపింది. ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందని పేర్కొంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఇలాంటి గ్రహ శకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లాయి. ఇంతవరకు భూమికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.

 

అయితే, ఈ గ్రహశకలం పరిమాణం వాటన్నింటికంటే చాలా పెద్దది. 2004 సెప్టెంబర్‌లో ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత గల టౌటాటిస్‌ అనే గ్రహశకలం ఒకటి భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనర్‌- చంద్రుడి నుంచి భూమికి మధ్య గల దూరం)తో దూసుకెళ్లింది. రాబోయే గ్రహశకలం టౌటాటిస్‌ కంటే కూడా పెద్దది. గడిచిన 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదే అని నాసా పేర్కొంది. దీంతో ఆ గ్రహశకలం భూమికి తాకుతుందని, ఆ తర్వాత భూగ్రహం అంతమవుతుందని వార్తలు వ్యాపించాయి. అయితే, ఏప్రిల్‌ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు ద్వారా ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని నాసా తెలిపింది.

 

 

నిజమెంత: ఈ ఏడాదిలోనే భూగ్రహంపై జీవిరాశీ అంతం కానుందా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *